త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prostitution Racket Busted | ముంబ‌యిలో హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇద్ద‌రు హీరోయిన్లను కాపాడిన పోలీసులు

Prostitution Racket Busted | ముంబ‌యిలో మ‌రోసారి హైటెక్ ప్రొఫైల్ వ్యభిచార ముఠా వ్యవహారం గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. ఇటీవ‌ల న‌వీ ముంబ‌యిలోని తుర్భే ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు చర్యలు తీసుకుని పలువురిని అరెస్టు చేసిన విషయం మరువకముందే.. తాజాగా దక్షిణ ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో మరో భారీ వ్యభిచార రాకెట్‌ను పోలీసులు ఛేదించారు.

P

Entertainment | Published On Jun 29, 2026, 7.53 pm IST

Prostitution Racket Busted | ముంబ‌యిలో హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇద్ద‌రు హీరోయిన్లను కాపాడిన పోలీసులు
Advertisement
  • ఓ మేక‌ప్ ఆర్టిస్ట్ అరెస్ట్‌

Prostitution Racket Busted | ముంబ‌యిలో మ‌రోసారి హైటెక్ ప్రొఫైల్ వ్యభిచార ముఠా వ్యవహారం గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. ఇటీవ‌ల న‌వీ ముంబ‌యిలోని తుర్భే ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు చర్యలు తీసుకుని పలువురిని అరెస్టు చేసిన విషయం మరువకముందే.. తాజాగా దక్షిణ ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో మరో భారీ వ్యభిచార రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ దాడిలో ఇద్దరు సినీ హీరోయిన్ల‌ను రక్షించడంతో పాటు, సినీ మేకప్ ఆర్టిస్ట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిర్గావ్ ప్రాంతంలోని ఓ ప్రదేశంలో మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారనే రహస్య సమాచారం అందింది. అక్కడ భారీ స్థాయిలో నగదు లావాదేవీలు కూడా జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సమాచారం నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు, ముందుగా ఓ నకిలీ కస్టమర్‌ను అక్కడికి పంపించారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో పోలీసులు ఒక్కసారిగా మెరుపుదాడులు నిర్వ‌హించారు.

ఈ ఆపరేషన్‌లో ఇద్దరు హీరోయిన్ల‌ను రక్షించారు. ఇందులో ఒకరు మరాఠీ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ కాగా.. మరో మహిళ బెంగాలీ, హిందీ చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌లో క‌నిపిస్తున్న న‌టిగా పోలీసులు వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీలో ప‌లువురు ప్ర‌ముఖ హీరోయిన్ల‌తో సంబంధాలు ఉన్న ఓ మేకప్ ఆర్టిస్ట్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యభిచార ముఠాలో అత‌ని పాత్ర ఏంటీ? మహిళలను ఈ వ్యవహారంలోకి తీసుకురావడంలో అతనికి సంబంధం ఉందా? లేక మరే విధంగా సహకరించాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న ముంబ‌యితో పాటు సినీ ఇండ‌స్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ వ్యభిచార ముఠా వెనుక మరెవరు ఉన్నారు? దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ఇంకెవరెవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకొని వారి పేర్ల‌ను గోప్యంగా ఉంచిన‌ట్లు స‌మాచారం. నిందితులుగా కాకుండా బాధితులుగా పరిగణించి పంపిన‌ట్లుగా తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఈ రొంపిలోకి వ‌చ్చారా? ఏమైనా బెదిరింపుల‌తో వ‌చ్చారా? అనే కోణంలో విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు పోలీసులు వివ‌రించారు.

 

Advertisement
Advertisement