త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Rice Exports | తెలంగాణ బియ్యానికి గ్లోబల్ డిమాండ్: ఎగుమతులపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

తెలంగాణను గ్లోబల్ రైస్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బియ్యం ఎగుమతులపై ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.

J

Telangana | Published On Jun 29, 2026, 7.33 pm IST

Telangana Rice Exports | తెలంగాణ బియ్యానికి గ్లోబల్ డిమాండ్: ఎగుమతులపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
Advertisement
  • హైదరాబాద్‌లో కేసీపీ న్యూట్రీ మల్టీ విటమిన్ రైస్‌ను లాంచ్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • తెలంగాణను గ్లోబల్ రైస్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
  • కేవలం ఎఫ్‌సీఐ (FCI) కొనుగోళ్లకే పరిమితం కాకుండా విదేశీ మార్కెట్లపై దృష్టి
  • రాష్ట్రంలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి
  • యాసంగిలో రికార్డు స్థాయిలో 81 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

Telangana Rice Exports | త్రినేత్ర.న్యూస్ : వానాకాలం, యాసంగి అని తేడా లేకుండా తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణను గ్లోబల్ రైస్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా (Global Rice Export Hub) మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు స్పెషల్ ఇన్సెంటివ్స్ (Special Incentives) ఇచ్చే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో కేసీపీ న్యూట్రీ సంస్థకు చెందిన మల్టీ విటమిన్ రైస్‌ను ఆయన లాంచ్ చేశారు.

ఎఫ్‌సీఐ పైనే ఆధారపడొద్దు..

కేవలం ఎఫ్‌సీఐ (FCI) కొనుగోళ్లకే పరిమితం కాకుండా.. రైతులు, మిల్లర్లు ప్రపంచ మార్కెట్‌ను టార్గెట్ చేయాలని మంత్రి సూచించారు. దేశీయంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్ ఉందన్నారు. నాణ్యమైన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే ఇండస్ట్రీలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని.. అవసరమైన పర్మిషన్లను సైతం ఫాస్ట్ ట్రాక్‌లో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Telangana to Offer Special Incentives for Rice Exports

వాల్యూ అడిషన్‌తో రెట్టింపు లాభాలు

సాధారణ బియ్యానికి బదులుగా ఫోర్టిఫైడ్ రైస్ (Fortified Rice), మల్టీ విటమిన్ రైస్ వంటి వాటిని ఉత్పత్తి చేయాలని మిల్లర్లకు మంత్రి పిలుపునిచ్చారు. ఇలా బియ్యానికి వాల్యూ యాడ్ (Value Addition) చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి ఆదరణ దక్కుతుందన్నారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరగడంతో పాటు మిల్లర్లకు రెట్టింపు లాభాలు వస్తాయని వివరించారు.

యాసంగిలో రికార్డు కొనుగోళ్లు

తెలంగాణ వ్యవసాయ సత్తా ఏంటో దేశానికి అర్థమైందని మంత్రి అన్నారు. ఈ ఒక్క యాసంగి సీజన్‌లోనే ఏకంగా 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించిన రూ. 19,303 కోట్లను ఎలాంటి జాప్యం లేకుండా రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా (DBT) జమ చేశామన్నారు. భౌగోళికంగా పెద్ద రాష్ట్రమైన ఏపీలో కేవలం 25 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు జరిగిందంటే.. తెలంగాణ ప్రభుత్వ రైతు అనుకూల విధానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

Telangana to Offer Special Incentives for Rice Exports

మిగులు రాష్ట్రం.. అపార అవకాశాలు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విస్తరణ, వ్యవసాయ విప్లవం వల్లే ఈ అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయని ఉత్తమ్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి వార్షిక బియ్యం ఉత్పత్తి 300 లక్షల మెట్రిక్ టన్నులు (300 LMT) దాటిందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రజల అవసరాలకు కేవలం 36 లక్షల టన్నులు మాత్రమే సరిపోతాయన్నారు. మిగిలిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయడం ద్వారా తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకువస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement