Vasudeva Reddy | సీఎం కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తా
Vasudeva Reddy | నిన్న నల్లగొండ సభలో సీఎం రేవంత్ చెప్పిన లేనిపోని మాటలు వింటుంటే నరాలు నిక్కపొడుస్తున్నాయని.. ఎదురుగా కనిపిస్తే చెంప చెల్లుమనేలా కొట్టాలనిపిస్తుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కె. వాసుదేవ రెడ్డి తనలోని ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఐదు వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చి ఎవరి ముక్కున బెడతారని నిలదీశారు.
- ఉద్యోగ నియామకాలపై నల్లగొండ సభలో అవే అబద్దాలు మాట్లాడిండు
- 16,978 ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీలో చెప్పి నిన్న70 వేలు అంటుండు
- 19 వేల ఖాళీలున్నాయని డీజీపీ చెప్తుంటే ఐదు వేలకు నోటిఫికేషన్ ఇస్తరట
- అవి ఎవరి ముక్కున పెడుతరు
- నిరుద్యోగుల ఆగ్రహంలో కొట్టుకపోతవ్
- రేవంత్‌పై కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కె .వాసుదేవ రెడ్డి ధ్వజం
Vasudeva Reddy | త్రినేత్ర.న్యూస్: నిన్న నల్లగొండ సభలో సీఎం రేవంత్ చెప్పిన లేనిపోని మాటలు వింటుంటే నరాలు నిక్కపొడుస్తున్నాయని.. ఎదురుగా కనిపిస్తే చెంప చెల్లుమనేలా కొట్టాలనిపిస్తుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కె. వాసుదేవ రెడ్డి తనలోని ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. డీజీపీ 19 వేల పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంటుంటే ఐదు వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చి ఎవరి ముక్కున బెడతారని నిలదీశారు. 16,978 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా చెప్పిందన్నారు. కానీ నిన్న నల్లగొండలో మాత్రం సీఎం 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం ఆయన అవివేకానికే నిదర్శనమన్నారు. ఈరోజు కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ముందు నిరుద్యోగులు ధర్నా చేశారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌పై ఫైరయ్యారు.
సిగ్గున్నదా సీఎం గారు..
నిన్న నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాలపై అవే అబద్దాలు మాట్లాడారు. నిరుద్యోగుల ఆత్మాగౌరవం నిలబెట్టాం అని అంటున్నారు. సీఎం మతి ఉండే మాట్లాడుతున్నారా? సిగ్గున్నదా సీఎం గారు?ఆయన ఓ గజినీలా మారిపోయారు. అసెంబ్లీలో చెప్పిన గణాంకాలు మార్చి చెబుతున్నారు. అసెంబ్లీలో చెప్పిన సంఖ్యను మరచిన సీఎం మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పెడతామనడం ఎందుకు? లేనిపోని మాటలు వింటుంటే నరాలు నిక్కపొడుస్తున్నాయి. ఎదురుగా కనిపిస్తే చెంప చెల్లుమనేలా కొట్టాలనిపిస్తుంది అని వాసుదేవరెడ్డి అన్నారు.
పోదామా అశోక్ నగర్ లైబ్రరీ..
రాహుల్ గాంధీ రాజకీయ క్రీడలో నిరుద్యోగులను పావులుగా వాడారు. సీఎం గారూ.. పోదామా అశోక్ నగర్ లైబ్రరీకి. నిరుద్యోగులతో చర్చిద్దామ్. నిరుద్యోగుల అసంతృప్తిని ఇంటెలిజెన్స్ వాళ్లు సీఎంకు చెప్పడం లేదా? 30 లక్షల నిరుద్యోగులను ప్రభుత్వం నట్టేట ముంచింది. నిరుద్యోగుల ఆగ్రహంలో రేవంత్ కొట్టుకుపోక తప్పదు. జాబ్ కేలండర్‌ను జాబ్‌లెస్ కేలండర్‌గా మార్చారు. విద్యాశాఖ,హోమ్ శాఖల నిర్వహణలో సీఎం ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి. సీఎం అబద్దాలు చెప్పడం ఆపకపోతే నిరుద్యోగులు ఆయనకు బుద్ది చెబుతారు అని వాసుదేవరెడ్డి హెచ్చరించారు.
అనంతగిరి దగ్గర పని చేయడం చేతకాదు.. కానీ: శుభ ప్రద్ పటేల్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
మూసీ ప్రక్షాళనపై సీఎం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అనంతగిరి దగ్గర పుడుతున్న మూసి ప్రారంభంలోనే మురుగు చేరుతోంది. కోటి రూపాయలు ఖర్చు పెడితే మూసి ఎస్‌టీపీని బాగు చేయొచ్చు. అక్కడ పని చేయడం చేత కాదు కానీ వేరే దగ్గర పనులు చేస్తా అంటున్నారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ నిర్వాసితులను నిర్లక్ష్యం చేయడాన్ని బీఆర్ఎస్ నిలదీస్తోంది. ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు లేదు. నిన్న నల్లగొండలో ఉద్యమకారుల త్యాగాలను రేవంత్ అవమానపరిచారు. ముమ్మాటికీ బీఆర్ఎస్ నాయకులది త్యాగాల చరిత్రే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IFS Transfers | తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు, పదోన్నతులు
జూన్ 29, 2026

IPS Transfers | తెలంగాణలో 12 ఐపీఎస్‌ల బదిలీ.. పలువురికి అదనపు బాధ్యతలు
జూన్ 29, 2026

Telangana Rice Exports | తెలంగాణ బియ్యానికి గ్లోబల్ డిమాండ్: ఎగుమతులపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Telangana Employee Arrears Released | ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ డబుల్ బొనాంజా: మరో రూ. 2 వేల కోట్లు రిలీజ్.. ఆ బిల్లులన్నీ క్లియర్!
- ●Bandaravirala Dumping Yard | ఒకవైపు లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన.. మరోవైపు క్యాచ్మెంట్ ఏరియాలోనే డంపింగ్ యార్డా? రేవంత్ సర్కార్‌పై ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఫైర్!
- ●IFS Transfers | తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు, పదోన్నతులు
- ●Petrol Diesel Restrictions Lifted | పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత, జూలై 1 నుంచే అమలు
- ●IPS Transfers | తెలంగాణలో 12 ఐపీఎస్‌ల బదిలీ.. పలువురికి అదనపు బాధ్యతలు
- ●Ram Pothineni | మెగా ఫోన్ పట్టిన రామ్ పోతినేని - ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ

Telangana Employee Arrears Released | ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ డబుల్ బొనాంజా: మరో రూ. 2 వేల కోట్లు రిలీజ్.. ఆ బిల్లులన్నీ క్లియర్!

Bandaravirala Dumping Yard | ఒకవైపు లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన.. మరోవైపు క్యాచ్మెంట్ ఏరియాలోనే డంపింగ్ యార్డా? రేవంత్ సర్కార్‌పై ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఫైర్!

IFS Transfers | తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు, పదోన్నతులు

Petrol Diesel Restrictions Lifted | పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత, జూలై 1 నుంచే అమలు



