త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | ధ‌నుష్‌తో పెళ్లికి మృణాల్ ఓకే చెప్పిందా?…. ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌?

కోలీవుడ్ హీరో ధ‌నుష్, సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఠాకూర్ పెట్టిన ఓ పోస్ట్ పెళ్లి వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. ఇంత‌కీ ఈ పోస్ట్‌లో ఏముందంటే?

N

Entertainment | Published On Jan 18, 2026, 4.45 pm IST

Mrunal Thakur | ధ‌నుష్‌తో పెళ్లికి మృణాల్ ఓకే చెప్పిందా?…. ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌?
Advertisement

Mrunal Thakur | కోలీవుడ్ హీరో ధ‌నుష్‌(Dhanush )ను హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోనున్న‌ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట ఫిబ్ర‌వ‌రి 14 వాలెంటైన్స్ డే రోజున పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కుటుంబస‌భ్యులు, కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో ధ‌నుష్, మృణాల్ ( Mrunal Thakur)పెళ్లి జ‌రుగ‌నుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం.

సెలైంట్‌...

అయితే ఈ పెళ్లి వార్త‌ల‌పై ధ‌నుష్‌తో పాటు మృణాల్ ఠాకూర్ మాత్రం రియాక్ట్ కాలేదు. ఔన‌ని చెప్ప‌లేదు. కాద‌ని ఖండించ‌లేదు. దాంతో ఈ రూమ‌ర్ల‌పై ఇద్ద‌రూ సెలైంట్‌గా ఉండ‌టంతో పెళ్లి వార్త‌లు నిజ‌మేన‌ని ఫ్యాన్స్ ఫిక్స‌వుతున్నారు.

ఇన్‌స్టాపోస్ట్‌...

ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఠాకూర్ ఓ పోస్ట్ పెట్టింది. బోట్‌లో స‌ముద్రంలో షికార్లు కొడుతోన్న ఓ ఫొటోను అభిమానుల‌తో పంచుకుంది. ఈ పోస్ట్‌కు గ్రౌండెడ్‌, గ్లోయింగ్ అన్‌షేక‌న్ అనే క్యాప్ష‌న్ జోడించింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు త‌మిళ పాట‌ను జోడించ‌డం నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఓకే చెప్పిందా?

పెళ్లి రూమ‌ర్స్ మొద‌లైన త‌ర్వాత మృణాల్ ఠాకూర్ పెట్టిన ఫ‌స్ట్ పోస్ట్ ఇది. అందులోనూ త‌మిళ పాట‌ను జోడిస్తూ పోస్ట్ పెట్ట‌డంతో పెళ్లి వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. ఈ కోలీవుడ్‌ పాట‌తో ఇన్‌డైరెక్ట్‌గా త‌మిళ వ్య‌క్తినే పెళ్లి చేసుకోనున్న‌ట్లు మృణాల్‌ హింట్ ఇచ్చేసింద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్ అవుతోంది. ఈ నెలాఖ‌రున పెళ్లిపై క్లారిటీ రానుంద‌ని అంటున్నారు.
ప్ర‌స్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో అడివిశేష్ డెకాయిట్‌తో పాటు అల్లు అర్జున్‌, అట్లీ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీతారామం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో బిజీ అయ్యింది.

Advertisement

తాజావార్తలు

Advertisement