త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | స్క్రిప్ట్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్న మృణాల్‌.. సీతారామం బ్యూటీ స్ట్రాటజీ మామూలుగా లేదుగా..!

Mrunal Thakur | కేవలం బిగ్‌ స్క్రీన్‌పై కనిపించాలనే ఉద్దేశంతో సినిమాలు ఒప్పుకునే ఆలోచన తనకు బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ స్పష్టం చేసింది. ప్రేక్షకులు మర్చిపోతారేమో అన్న భయంతో చాలామంది నటీనటులు వరుసగా సినిమాలు చేస్తుంటారని, అయితే తనకు అలాంటి భయం లేదని తేల్చి చెప్పింది.

P

Entertainment | Published On May 6, 2026, 10.00 pm IST

Mrunal Thakur | స్క్రిప్ట్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్న మృణాల్‌.. సీతారామం బ్యూటీ స్ట్రాటజీ మామూలుగా లేదుగా..!
Advertisement

Mrunal Thakur | కేవలం బిగ్‌ స్క్రీన్‌పై కనిపించాలనే ఉద్దేశంతో సినిమాలు ఒప్పుకునే ఆలోచన తనకు బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ స్పష్టం చేసింది. ప్రేక్షకులు మర్చిపోతారేమో అన్న భయంతో చాలామంది నటీనటులు వరుసగా సినిమాలు చేస్తుంటారని, అయితే తనకు అలాంటి భయం లేదని తేల్చి చెప్పింది. పాత్రలో బలం లేని సినిమా చేయడం కంటే.. మంచి కథ కోసం వెయిట్‌ చేయడమే మంచిదని తెలిపింది. ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదని.. ఒక్క సినిమా చేసిన అది ప్రేక్షకులకు గుర్తుండి పోవాలన్నదే తన ఉద్దేశమని , అందుకే తనకు నచ్చని పాత్రలు వస్తే ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తానని తెలిపింది.

నటిగా తనకు ప్రత్యేక గుర్తింపు రావాలని, తాను చేసే పాత్రలు ప్రేక్షకుల మనసులను తాకాలని మృణాల్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్థాయిలో కథలు ఎంచుకునే స్వేచ్ఛ తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, అందుకే నచ్చిన సినిమాలనే చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పింది. ఎప్పుడూ బిజీగా ఉండాల్సిన అవసరం లేదని కూడా మృణాల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. మధ్యలో గ్యాప్ తీసుకుంటేనే కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని, నటీనటులకు కూడా అది ఉపయోగపడుతుందని చెబుతోంది, వరుస సినిమాలు చేస్తే కథల ఎంపికలో కొత్తదనం తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. మృణాల్‌ కెరీర్‌ ప్రారంభంలో హిందీలో సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సూపర్ 30, జెర్సీ వంటి సినిమాల్లో నటించింది. ‘సీతారామం’తో టాలీవుడ్‌కు పరిచయమైంది.

ఆ సినిమాలో ఆమె చేసిన సీతా మహాలక్ష్మి పాత్ర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత హాయ్‌ నాన్నలో నానితో జతకట్టింది. ఇటీవల అడివి శేష్‌తో ‘డెకాయిట్లో’ మృణాల్ కీలక పాత్ర పోషించింది. సినిమా పెద్దగా ఆడకపోయినా, తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. మొత్తానికి చేసే నంబర్ల కంటే మంచి పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ మృణాల్ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలనే చేయాలన్న లక్ష్యంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో హై జవానీ ఇష్క్‌ హోనా హై, పూజా మేరి జాన్‌తో పాటు తెలుగులో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’లోనూ కీలకపాత్ర పోషించనుంది.

Advertisement
Advertisement