త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | 2022లో షూటింగ్ కంప్లీట్ – 2026లో రిలీజ్ – డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ

మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ పూజా మేరీ జాన్ షూటింగ్ పూర్త‌యిన నాలుగేళ్ల త‌ర్వాత రిలీజ్ కాబోతుంది. అదీ కూడా థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీ ద్వారా ఈ హిందీ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. పూజా మేరీ జాన్ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. పూజా మేరీ జాన్‌లో మృణాల్ ఠాకూర్‌తో పాటు హ్యుమా ఖురేషి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

N

Entertainment | Published On Jul 21, 2026, 6.24 pm IST

Mrunal Thakur | 2022లో షూటింగ్ కంప్లీట్ – 2026లో రిలీజ్ – డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ
Advertisement

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్త‌యిన నాలుగేళ్ల త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మృణాల్ ఠాకూర్‌, హ్యుమా ఖురేషి, విక్ర‌మ్ సింగ్ చౌహాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో పూజా మేరీ జాన్ పేరుతో హిందీలో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ రూపొందింది. న‌వ‌జోత్ గులాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.

యాభై కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు యాభై కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ షూటింగ్ 2022లోనే కంప్లీట్ అయ్యింది. ఓటీటీ డీల్‌లో ఇబ్బందులు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య త‌లెత్తిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా పూజా మేరీ జాన్ రిలీజ్‌కు నోచుకోలేదు. తొలుత ఈ హిందీ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను డిస్నీ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. కానీ జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ విలీనం కార‌ణంగా పూజా మేరీ జాన్ ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయ్యింది. థియేట‌ర్ల‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. స‌రైన బిజినెస్ జ‌ర‌గ‌క‌పోవ‌డం, ఛావాతో పోటీ కార‌ణంగా వాయిదాప‌డింది. ఆ త‌ర్వాత పూజా మేరీ జాన్సం విడుదలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

జీ 5 ఓటీటీ...

తాజాగా త‌మ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానున్న అప్‌క‌మింగ్ సినిమాల వివ‌రాల‌ను జీ5 ఓటీటీ ఇటీవ‌ల రివీల్ చేసింది. ఈ లిస్ట్‌లో పూజా మేరీ జాన్ కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను జీ5 సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో పూజా మేరీ జాన్ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా  స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

సైబ‌ర్ క్రైమ్‌...

సైబ‌ర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు న‌వ‌జోత్ గులాటి ఈ సినిమాను తెర‌కెక్కించారు. పూజా అనే అమ్మాయిని సోష‌ల్ మీడియాలో ఓ యువ‌కుడు మారుపేర్ల‌తో వేధిస్తుంటాడు. ఆ సైకోకు బుద్ది చెప్పేందుకు పూజా ఏం చేసింది? ఈ పోరాటంలో ఆమెకు ఎలాంటి క‌ష్టాలు, అడ్డంకులు ఎదుర‌య్యాయ‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

 

Advertisement
Advertisement