Virosh Wedding Reception | నేడు తుమ్మెనపేటకు విరోష్ జోడీ.. ముస్తాబైన రౌడీ హీరో స్వగ్రామం
Virosh Wedding Reception | వివాహబంధంతో ఒకటైన టాలీవుడ్ లవబుల్ కపుల్ విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ (Reception) సోమవారం జరుగనుంది. దీనికోసం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెనపేట (Thummanpet) ముస్తాబయింది.
Entertainment | Published On Mar 2, 2026, 8.10 am IST
Virosh Wedding Reception | త్రినేత్ర.న్యూస్: వివాహబంధంతో ఒకటైన టాలీవుడ్ లవబుల్ కపుల్ విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ (Reception) సోమవారం జరుగనుంది. దీనికోసం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెనపేట (Thummanpet) ముస్తాబయింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటైన విరోష్ జోడీ తమ గ్రామ ప్రజల ఆశీర్వాదాలు (Virosh Wedding Reception) పొందెందుకు ప్రత్యేకంగా ఈ వేడుకను ఏర్పాటు చేశారు. గ్రామంలోని విజయ్‌దేవరకొండ ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు రిసెప్షన్ ఘనంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుద్దీపాలతో ఫామ్‌హౌస్‌ను అలంకరించారు. తొలిసారిగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) దంపతులు స్వగ్రామానికి వస్తుండటంతో ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, అధికారులతో పాటు సుమారు 5 వేల మంది హాజరవుతున్నట్లు రౌడీ హీరో కుటుంబ సభ్యులు వెల్లడించారు.
పండుగ వాతావరణం
దేవరకొండ గోవర్ధన్‌రావు-మాధవి దంపతులకు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఇద్దరు కుమారులు. విజయ్ దేవరకొండ తుమ్మెన్‌పేట గ్రామంలోనే జన్మించారు. ఆయనకు నాలుగేండ్లు ఉన్నప్పుడు గ్రామంనుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం తుమ్మెన్‌పేటలో వారికి 8 ఎకరాల వ్యవసాయభూమి, పండ్లు, పూల తోట, అందమైన ఇల్లు ఉన్నది. విజయ్ సాధారణ కుటుంబం నుంచి ఎదిగి టాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి తన జీవితంలోని ముఖ్యఘట్టమైన వివాహ రిసెప్షన్‌ను స్వగ్రామంలో నిర్వహించుకోవడం గ్రామస్తులకు గర్వకారణంగా మారింది. మా ఊరిబిడ్డ దేశం గర్వించే స్థాయికి చేరుకొని మళ్లీ మా మధ్యకే వచ్చి వేడుక జరుపుకోవడం తమ అదృష్టం అంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వైభవంగా ఏర్పాట్లు
గ్రామస్తులు వేడుకవద్ద స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. సంప్రదాయ బద్ధంగా కోలాటాలు, జానపద నృత్యాలు, డప్పుల వాయిద్యాలతో నూతన దంపతులకు ఘనస్వాగతం పలుకనున్నారు. వీఐపీలు 800 మందికి ప్రత్యేక వంటకాలు ఏర్పాట్లు చేశారు. అభిమానులు, ప్రజల కోసం పక్కన్నే టెంట్లు వేసి దాదాపు 5 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, స్థానిక ప్రముఖులు, రాజకీయ నేతలను, గ్రామస్థులను ఆహ్వానించారు. అతిథులకు ప్రత్యేకంగా తెలంగాణ రుచులతో 42 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు.
4న హైదరాబాద్‌లో..
విజయ్-రష్మిక పెండ్లి వేడుకకు కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం విరోష్ జోడీ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిపెప్షన్ జరుగనుంది. ఈ కార్యాక్రమానికి వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు హాజరుకాబోతున్నారు. పోలీసులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్వానం లేని వారు ఈ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గెస్టుల క్షేమంతో పాటు రిసెప్షన్ వేడుక సజావుగా సాగేందుకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని విరోష్ టీమ్ కూడా కోరుతున్నారు. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ విజయ్, రష్మికలకు ఉంటాయని వారి టీమ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.విజయ్, రష్మికలకు పాన్ ఇండియన్ లెవెల్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దక్షిణాదితో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026

Rashmika Mandanna | గ్లోబల్ స్టేజ్‌పై నేషనల్ క్రష్ …. టోక్యో యానిమే అవార్డ్స్ ప్రజెంటర్‌గా రష్మిక
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



