త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asha Bhosle | ప్ర‌ముఖ గాయ‌ని ఆశా భోస్లేకు గుండెపోటు..!

Asha Bhosle | ప్ర‌ముఖ గాయ‌ని ఆశా భోస్లే గుండెపోటుకు గుర‌య్యారు. దీంతో ఆమెను కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

S

Entertainment | Published On Apr 11, 2026, 9.59 pm IST

Asha Bhosle | ప్ర‌ముఖ గాయ‌ని ఆశా భోస్లేకు గుండెపోటు..!
Advertisement

Asha Bhosle | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌ముఖ గాయ‌ని ఆశా భోస్లే గుండెపోటుకు గుర‌య్యారు. దీంతో ఆమెను కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఎమ‌ర్జెన్సీ విభాగంలో ఆమె చికిత్స పొందుతున్నారు.

బ్రీచ్ క్యాండి హాస్పిట‌ల్ డాక్ట‌ర్ ప్ర‌తీత్ సందాని క‌థ‌నం మేర‌కు.. శ‌నివారం రాత్రి ఆశా భోస్లే గుండెపోటుకు గుర‌య్యారు. ఎమ‌ర్జెన్సీ మెడిక‌ల్ స‌ర్వీసెస్ యూనిట్‌లో ఆమెకు చికిత్స అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

సంగీత రంగంలో ఆమె చేసిన కృషికి గానూ 2000లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు ఉమ్రావ్ జాన్, ఇజాజ‌త్ చిత్రాల‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌కు గానూ రెండు జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను పొందారు.

Advertisement
Advertisement