త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Devarakonda | సందీప్ రెడ్డి వంగా సూచ‌న సూప‌ర్బ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్

Vijay Devarakonda | వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు సందీప్ రెడ్డి వంగా సూచించిన పేర్ల‌పై టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఎక్స్ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

S

Entertainment | Published On Sep 20, 2026, 1.38 pm IST

Vijay Devarakonda | సందీప్ రెడ్డి వంగా సూచ‌న సూప‌ర్బ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్
Advertisement

Vijay Devarakonda | త్రినేత్ర‌.న్యూస్ : వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు పేరు సూచించాల‌ని ఎక్స్ వేదిక‌గా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ్ఞ‌ప్తిపై టాలీవుడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా త‌క్ష‌ణ‌మే స్పందిస్తూ.. రుద్ర‌మ‌దేవి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు లేదా కాక‌తీయ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు అని నామ‌క‌ర‌ణం చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డికి సూచ‌న చేశారు. సీఎం కూడా ద‌ట్స్ ది స్పిరిట్ అని బదులిచ్చారు.

సందీప్ రెడ్డి సూచించిన పేర్ల‌పై టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఎక్స్ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గ్రేట్ న్యూస్. గొప్ప ప్ర‌దేశాల‌కు ఆ ప్రాంతానికి చెందిన గొప్ప వ్య‌క్తుల పేర్లు ఉండాలి. వ‌రంగ‌ల్ అబ్బాయి సందీప్ సూచించిన పేర్లు సూప‌ర్బ్. రుద్ర‌మ‌దేవి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు లేదా కాక‌తీయ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు పేర్లు ఓరుగ‌ల్లుకు చ‌రిత్ర‌ను మ‌న‌కు గుర్తు చేస్తాయని విజ‌య్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ.. ఒక అద్భుత‌మైన ఎయిర్‌పోర్టును చూడాల‌ని ఆశిస్తున్నాన‌ని విజ‌య్ తెలిపారు.

Advertisement
Advertisement