Mana Shankara Varaprasad Garu | నిలిచిన మన శంకరవరప్రసాద్ గారు షో.. అలంకార్ థియేటర్ వద్ద ఉద్రిక్తత
Mana Shankara Varaprasad Garu | సంక్రాంత్రి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన `మన శంకరవరప్రసాద్ గారు` (Mana Shankara Varaprasad Garu) సినిమా సోమవారం విడుదలైంది.
Entertainment | Published On Jan 12, 2026, 11.48 am IST
త్రినేత్ర.న్యూస్: సంక్రాంత్రి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన `మన శంకరవరప్రసాద్ గారు` (Mana Shankara Varaprasad Garu) సినిమా సోమవారం విడుదలైంది. అనిల్ మార్క్ కామెడీకి మెగాస్టార్ టైమింగ్ జతకలవడంతో థియేటర్లలో శంకరవరప్రసాద్ నవ్వులు పూయిస్తున్నాడు. అయితే హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని అలంకార్ థియేటర్‌లో బెనెఫిట్ షో చూడటానికి వచ్చిన చిరంజీవి అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 7.30 గంటలకు మార్నింగ్ షో ప్రదర్శించాల్సి ఉంది. దీనికోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం బుక్‌మై షో వేదికగా పలువురు టికెట్లు బుక్‌చేసుకున్నారు. సమయానికి థియేటర్‌కు చేరుకున్నారు. అయితే షో క్యాన్సల్ అయిందనే బోర్డు చూసి అవక్కైన ప్రేక్షకులు.. థియేటర్ ముందు ధర్నాకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా షోను ఎలా రద్దు చేస్తారని నిర్వాహకులను నిలదీశారు. కనీసం బుక్‌మై షో వారు కూడా రద్దుకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులకు సర్దిచెప్పడానికి యత్నించారు. అయినా వారు వినకపోవడంతో.. థియేటర్ యాజమాన్యం దిగివచ్చింది. ఉదయం 11 గంటల షోకు అనుమతిస్తామని చెప్పడంతో వారు శాంతించారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం ఉదయం షో క్యాన్సల్ అయిందని ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం ద్వారా అందరికీ సమాచారం అందించారు. కాగా, కేవలం 30 నుంచి 40 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయని సమాచారం. టికెట్లు పూర్తి స్థాయిలో అమ్ముడు పోకపోవడంతో షోను రద్దు చేసినట్లు తెలుస్తున్నది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



