త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

The Rajasaab | అర్ద‌రాత్రి జీవో.. రాజాసాబ్‌ టికెట్‌ ధరల పెంపునకు స‌ర్కార్ ఓకే

ఎట్ట‌కేల‌కు ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ‘ది రాజాసాబ్‌’ (The Rajasaab) సినిమా టికెట్‌ ధరలు (Ticket Price Hike) పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేర‌కు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జీవో జారీ చేసింది.

G

Entertainment | Published On Jan 9, 2026, 8.25 am IST

The Rajasaab | అర్ద‌రాత్రి జీవో.. రాజాసాబ్‌ టికెట్‌ ధరల పెంపునకు స‌ర్కార్ ఓకే
Advertisement

trinethra.news: ఎట్ట‌కేల‌కు ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ‘ది రాజాసాబ్‌’ (The Rajasaab) సినిమా టికెట్‌ ధరలు (Ticket Price Hike) పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేర‌కు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జీవో జారీ చేసింది. ప్రీమియ‌ర్ షోల‌కు నో చెప్పిన ప్ర‌భుత్వం, టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు మాత్రం స‌మ్మ‌తించింది.

దీంతో శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంచి పెంపునకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంచి అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. టికెట్‌ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని స్ప‌ష్టం చేసింది.

మారుతి ద‌ర్శ‌కత్వంలో హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించింది. ఈ మూవీలో మాళవిక మోహనన్‌, రిద్ధికుమార్‌, నిధి అగర్వాల్‌తో ప్రభాస్ రొమాన్స్ చేశారు. సంజయ్‌దత్ విల‌న్‌గా న‌టించ‌గా, తమన్‌ సంగీతం అందించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement