త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hollywood OTT | ఓటీటీలోకి క్రిస్టోఫ‌ర్ నోల‌న్ హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ది ఒడిస్సీ – ట్విస్ట్ ఏంటంటే?

హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ది ఒడిస్సీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ గుడ్‌న్యూస్ వినిపించారు. ఆగ‌స్ట్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆపిల్ టీవీ ఓటీటీల‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మాట్ డామ‌న్‌, అన్నా హాథ్‌వే, టామ్ హాలండ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

N

Entertainment | Published On Aug 11, 2026, 3.21 pm IST

Hollywood OTT |  ఓటీటీలోకి క్రిస్టోఫ‌ర్ నోల‌న్ హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ది ఒడిస్సీ – ట్విస్ట్ ఏంటంటే?
Advertisement

Hollywood OTT | హాలీవుడ్‌ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క్రిస్టోఫ‌ర్ నోల‌న్ తెర‌కెక్కించిన ది ఒడిస్సీ థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 9500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. డార్క్ నైట్ రైజెస్ త‌ర్వాత‌ క్రిస్టోఫ‌ర్ నోల‌న్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సెకండ్ మూవీగా నిలిచింది.

నోల‌న్ టేకింగ్‌...

ది ఒడిస్సీ విజ‌యంలో క్రిస్టోఫ‌ర్ నోల‌న్ టేకింగ్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, విజువ‌ల్స్‌తో పాటు మాట్ డామ‌న్‌, అన్నా హాథ్‌వే, టామ్ హాలండ్ యాక్టింగ్ విజ‌యంలో కీల‌కంగా నిలిచాయి. గ్రీకు పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా ఈ మూవీ రూపొందింది.

రెండు ఓటీటీల‌లో...

ఈ హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. వారికి మేక‌ర్స్ గుడ్‌న్యూస్ వినిపించారు. ది ఒడిస్సీ రెండు ఓటీటీల‌లో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆపిల్ టీవీల‌లో ది ఒడిస్సీ స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే తొలుత అమెరికాలోనే ఈ సినిమా విడుద‌ల కానుంది. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి ఇండియాలో స్ట్రీమింగ్‌కు ఈ హాలీవుడ్ మూవీ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఒడిస్సియ‌స్ ప్ర‌యాణం...

స్పార్టా రాజ్యాన్ని ఆక్ర‌మించి ఇథాకా బ‌య‌లుదేరిన ఒడిస్సియ‌స్ (మాట్ డామ‌న్‌) ప‌దేళ్ల‌యినా ఇంటికి చేరుకోడు. భ‌ర్త కోసం ఒడిస్సియ‌స్ భార్య పెనెలోప్‌తో (అన్నే హాథ్‌వే) పాటు ఆమె కొడుకు టెలెమాక‌స్ (టామ్ హాలెండ్‌) ఎదురుచూస్తుంటారు. మ‌రోవైపు ఇథాకా రాజ్యంపై క‌న్నేస్తాడు ఆంటిన‌స్‌. పెనెలోప్‌ను పెళ్లి చేసుకొని ఇథాకాను త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని కుట్ర‌లు ప‌న్నుతాడు.
పొసైడెన్ అనే స‌ముద్ర దేవ‌త శాపంతో జ్యూయిష్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కార‌ణంగా స‌ముద్రంలో ఒడిస్సియ‌స్ సేన దారి త‌ప్పుతుంది.ఈ ప్ర‌యాణంలో వారికి ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి. త‌న సైన్యాన్ని కాపాడుకోవ‌డానికి ఒడిస్సియ‌స్ ఏం చేశాడు? ప‌దేళ్లు రాజ్యానికి దూర‌మైన ఒడిస్సియ‌స్‌కు ఆశ్ర‌యం ఇచ్చిన కాలిప్సో ఎవ‌రు? బిచ్చ‌గాడిగా మారువేషంలో ఇథాకాలో అడుగుపెట్టిన ఒడిస్సియ‌స్ త‌న భార్యాబిడ్డ‌ల‌ను ఎలా క‌లుసుకున్నాడు? ఆంటిన‌స్ కుట్ర‌ల‌ను ఏ విధంగా తిప్పికొట్టాడు అన్న‌దే ది ఒడిస్సీ మిగిలిన క‌థ‌.

 

 

 

 

Advertisement
Advertisement