Shruti Haasan | మౌనంగా ఉండాల్సిన సమయం దాటిపోయింది : శృతి హాసన్
Shruti Haasan | ఇప్పటి వరకు వెండితెరపై నటన, తన అందచందాలతో అలరించిన బ్యూటీ శృతి హాసన్. తాజాగా ఓ సామాజిక అంశంతో తెరకెక్కిన ఓ డాక్యుమెంటరీకి గాత్రదానం చేశారు. తెలంగాణలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, బయట ప్రపంచానికి తెలియని కొన్ని హృదయ విదారక వాస్తవాల నేపథ్యంలో రూపొందిన ‘సైలెంట్ స్క్రీమ్స్ : ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’ అనే క్రైమ్ డాక్యుమెంటరీకి తన వాయిస్ అందించారు.
Entertainment | Published On Jan 10, 2026, 11.10 pm IST
Shruti Haasan | ఇప్పటి వరకు వెండితెరపై నటన, తన అందచందాలతో అలరించిన బ్యూటీ శృతి హాసన్. తాజాగా ఓ సామాజిక అంశంతో తెరకెక్కిన ఓ డాక్యుమెంటరీకి గాత్రదానం చేశారు. తెలంగాణలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, బయట ప్రపంచానికి తెలియని కొన్ని హృదయ విదారక వాస్తవాల నేపథ్యంలో రూపొందిన ‘సైలెంట్ స్క్రీమ్స్ : ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’ అనే క్రైమ్ డాక్యుమెంటరీకి తన వాయిస్ అందించారు. సమాజానికి తెలియని విషయాలను ప్రపంచానికి వినిపించాలనే ఉద్దేశంతో శృతి ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ కథ వినప్పుడు తన మనసు కలచివేసిందన్నారు. వీటిని ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని భావించానని చెప్పింది. ఇది కేవలం గతం గురించి మాత్రమే కాదని.. ఇప్పటికీ ఎందరో మహిళలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాల గురించని తెలిపారు. మనం మౌనంగా ఉండాల్సిన సమయం దాటిపోయిందని.. బాధితుల పక్షాన నిలబడి ఈ చర్చను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొంది.
తెలంగాణలో జరిగిన యథార్థ సంఘటనలపై వెలుగులోకి వచ్చిన కేసుల ఆధారంగా తెరకెక్కించిన క్రైమ్ డాక్యుమెంటరీయే ‘సైలెంట్ స్క్రీమ్స్ : ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పెరుగుతున్న ఈ కాలంలో.. వాటి వెనుక ఉన్న వ్యక్తుల కథలను తెలియచెప్పే ఈ డాక్యుమెంటరీలోని సన్ నెక్ట్స్ ముందుకు తీసుకువచ్చింది. వరంగల్, ఆసిఫాబాద్, నల్గండ జిల్లాల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. నేరాల ప్రభావం ఆయా కుటుంబాలు, సమాజంపై ఎంత లోతుగా ఉంటుందనే విషయాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం డాక్యుమెంటరీ ఓటీటీలో స్క్రీమింగ్ అవుతున్నది.
ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీలో హీరోయిన్‌గా కనిపించింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్-2తో పాటు తమిళ మూవీ ట్రైన్‌లో కనిపించనున్నది. 2023లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్ తర్వాత.. ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’పై సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే, విజయ్ సేతుపతి నటిస్తున్న ‘ట్రైన్’ మూవీలో కనిపించనున్నది. ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించారు. శృతి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలోని తొలి పాట ఇటీవల విడుదలవగా.. మంచి రెస్పాన్స్ వస్తున్నది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



