Trump Road | హైదరాబాద్‌లో కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు : లెఫ్ట్ పార్టీలు
Trump Road | హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీప ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య, ప్రగతిశీల విలువలకు విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.
Trump Road | హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీప ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య, ప్రగతిశీల విలువలకు విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో బుధవారం జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద విధానాలు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు.
అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ పేరును హైదరాబాద్‌లోని రహదారికి పెట్టాలని నిర్ణయించడం సమంజసం కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ నెల 20న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మేధావులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని, 21న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, ఎంసీపీఐ(యు), న్యూడెమోక్రసీ, ఎస్‌యూసీఐ(సి), ఆర్‌ఎస్‌పీ తదితర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు
- ●Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
- ●Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!
- ●TG High Court | ఆ ఐదెకరాల భూమి మాదే.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన హైకోర్టు..!
- ●ADG Vijay Kumar | లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కఠిన చర్యలు: ఏడీజీ విజయ్ కుమార్
- ●Apollo Hospitals FEMA Violation | అపోలో హాస్పిటల్స్‌పై 'ఫెమా' కొరడా.. రూ. 2400 కోట్ల నిబంధనల ఉల్లంఘన, డైరెక్టర్లకు భారీ జరిమానా!

Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు

Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ

Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!

TG High Court | ఆ ఐదెకరాల భూమి మాదే.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన హైకోర్టు..!



