TG High Court | ఆ ఐదెకరాల భూమి మాదే.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన హైకోర్టు..!
TG High Court | రాయదుర్గం భూముల వేలం వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలంలో భాగంగా విక్రయించిన స్థలాల్లో కొంత భూమిపై తమకే హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
TG High Court | రాయదుర్గం భూముల వేలం వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలంలో భాగంగా విక్రయించిన స్థలాల్లో కొంత భూమిపై తమకే హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. గత నెల 28న నాలెడ్జ్ సిటీ పరిధిలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న ప్రీమియం భూములను రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ వేలం ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఐటీ కారిడార్‌లో ఉన్న ఈ స్థలాలకు భారీ డిమాం ఉన్నది. ఎకరానికి కనీస ధరను రూ.170 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది.
ముఖ్యంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరా వెంచర్స్ ఎకరానికి రూ.237 కోట్ల ధరకు ఒక ప్లాట్‌ను సొంతం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వేలం పూర్తయిన కొద్ది రోజులకే ఎస్‌బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్వే నంబర్ 83/1లోని సుమారు ఐదు ఎకరాల భూమి తమ యాజమాన్యానికి చెందినదని, ఆ స్థలంపై పూర్తి హక్కులు బ్యాంక్‌కే ఉన్నాయని రిట్ పిటిషన్‌లో పేర్కొంది. తమకు చెందిన ఆస్తిని ప్రభుత్వం వేలంలో చేర్చడం ఎలా సమంజసమని ప్రశ్నించిన ఎస్‌బీఐ, వేలం ప్రక్రియపై తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరింది. వేల కోట్ల రూపాయల విలువైన భూ వివాదంలో చిక్కుకుంది. హైకోర్టు దాకా చేరడంతో రాయదుర్గం భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Irrigation Projects | ప్రాజెక్టులకు పూర్వ వైభవం.. జలాశయాల్లో డీసిల్టేషన్పై మంత్రి ఉత్తమ్ ఫోకస్, అధికారులకు కీలక ఆదేశాలు
- ●Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు
- ●Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
- ●Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!
- ●Trump Road | హైదరాబాద్‌లో కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు : లెఫ్ట్ పార్టీలు
- ●ADG Vijay Kumar | లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కఠిన చర్యలు: ఏడీజీ విజయ్ కుమార్

Telangana Irrigation Projects | ప్రాజెక్టులకు పూర్వ వైభవం.. జలాశయాల్లో డీసిల్టేషన్పై మంత్రి ఉత్తమ్ ఫోకస్, అధికారులకు కీలక ఆదేశాలు

Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు

Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ

Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!




