త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ

Minister Vakiti Srihari | తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

P

Telangana | Published On Jun 17, 2026, 10.02 pm IST

Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
Advertisement

Minister Vakiti Srihari | తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో విద్యా సహకారం, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉన్నత విద్య అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర భాగస్వామ్యంపై చర్చించారు. ముఖ్యంగా చిచెస్టర్ యూనివర్సిటీలో కోచ్‌లకు అందిస్తున్న శిక్షణ, క్రీడాకారుల నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలపై విశ్వవిద్యాలయ ప్రతినిధులు వివరించారు.

తెలంగాణ యువత ప్రపంచ స్థాయి విద్యను అందిపుచ్చుకుని అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో పోటీ పడేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి శ్రీహరి సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్‌పోజర్ కల్పించే అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు తమ విద్యా, పరిశోధన కార్యక్రమాలు, అంతర్జాతీయ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక పథకాల గురించి వివరించారు. తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించేందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి విశ్వవిద్యాలయ ప్రతినిధులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధి ఒలివియా మెక్‌లాగ్లిన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement