Virosh | విరోష్ పెళ్లి సందడి.. పూల్ పార్టీతో వేడుకలు షురూ
Virosh | అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని (Udaipur Wedding) ఐటీసీ మెమోంటోస్ హోటల్‌లో వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి.
Entertainment | Published On Feb 24, 2026, 10.09 am IST
Virosh | అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని (Udaipur Wedding) ఐటీసీ మెమోంటోస్ హోటల్‌లో వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి. పూల్ పార్టీ (pool party)తో వేడుకలు షురూ అయ్యాయి. తమ ఫ్రెండ్స్‌తో విజయ్ పూల్‌లో వాలీబాల్ ఆడుతున్న ఫొటోలను రౌడీబాయ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసుకున్నారు. ఇక నిన్న రాత్రి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కోసం క్యాండిల్‌లైట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి విందులో అతిథుల కోసం ప్రత్యేకంగా జపనీస్ వంటకాలను ఏర్పాటు చేసినట్టు రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక వివాహం జరుగనుంది. దీంతో మూడు రోజుల ముందే వీరిద్దరు ఉదయ్‌పూర్‌లో అడుగుపెట్టారు. సోమవారం ఉదయం ఉదయ్‌పూర్ బయలుదేరుతూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్, రష్మిక కనిపించారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి వీరు ఫ్లైట్ ఎక్కారు. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి పోలీస్ సెక్యూరిటీ మధ్య వీరిద్దరు హోటల్‌కు చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అరావళి పర్వత శ్రేణుల మధ్య యాభై ఏకరాల విస్తీర్ణంలో ఈ హోటల్ ఉంటుందట. వివాహానికి కేవలం 50 మంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ఒక్కరికీ ఇన్విటేషన్ లేదు. వివాహానంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

మూడు కోట్ల వరకు..
విజయ్, రష్మిక తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి ఓ వంద మంది వరకు అటెండ్ కానున్నట్లు సమాచారం. ఐటీసీ మెమోంటోస్‌లో వెడ్డింగ్ ప్యాకేజీలో కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఖర్చులు అదనం. విజయ్, రష్మిక తమ పెళ్లి కోసం మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ బర్త్‌డే సర్ప్రైజ్ – చేతిలో గన్‌తో రౌడీ జనార్ధన… రొమాంటిక్ పోస్టర్ రిలీజ్
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



