Tripuraneni Chittibabu | ప్రముఖ దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
Tripuraneni Chittibabu | తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ చలనచిత్ర నిర్మాత, రచయిత, దర్శకుడు, నటుడు, బీజేపీ సీనియర్ నేత త్రిపురనేని చిట్టిబాబు (Tripuraneni Chittibabu) కన్నుమూశారు.
Entertainment | Published On Apr 22, 2026, 10.32 am IST
Tripuraneni Chittibabu | తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ చలనచిత్ర నిర్మాత, రచయిత, దర్శకుడు, నటుడు, బీజేపీ సీనియర్ నేత త్రిపురనేని చిట్టిబాబు (Tripuraneni Chittibabu) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్లు. మంగళవారం రాత్రి కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఉషా లత, ముగ్గురు పిల్లలు నరోత్తం, భాస్వంత్, మోనిషా ఉన్నారు. చిట్టిబాబు మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
కాగా, సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్రగామిగా నిలిచిన చిట్టిబాబు.. కేవలం 17 ఏళ్ల వయసులోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని అనేకమంది ప్రముఖులతో కలిసి పనిచేశారు. వారిలో ఏ. సి. తిరులోక్‌చందర్, భారతి రాజా, కె. ఎస్. ఆర్. దాస్, కన్నదాసన్, వాలి, ఎం. ఎస్. విశ్వనాథన్, టి. రాజేందర్, శ్రీశ్రీ, ఆచార్య ఆత్రేయ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి మహనీయులు ఉన్నారు. 'సంతానం' సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా మారకముందు ఆయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మొత్తం 47 సినిమాలకు సహ దర్శకుడిగా పనిచేశారు.
సౌందర్యను టాలీవుడ్‌కు పరిచయం చేసింది కూడా ఈయనే..
ఆయన తొలి చిత్రం సంతానం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 30 చిత్రాల్లో నటించారు. ఒక నిర్మాణ సంస్థను విజయవంతంగా నడిపి, సినీ రంగ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. దివంగత ప్రముఖ నటి సౌందర్యను టాలీవుడ్‌కి పరిచయం చేసింది కూడా చిట్టిబాబే. సౌందర్యతోపాటూ కృష్ణ వంశీ, శివ నాగేశ్వరరావు, శోభన్, రసూల్ ఎల్లోర్, విజయన్, పారుచూరి బ్రదర్స్, శివ ప్రసాద్ తదితరులను కూడా ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వారంతా తమ నటనతో ఉన్నతస్థాయికి చేరుకున్నారు.
రాజకీయాల్లోనూ కీలక పాత్ర..
సినీ రంగంతోపాటూ చిట్టిబాబు రాజకీయ రంగంలోనూ కీలక పాత్ర పోషించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపన నుంచే కొనసాగుతున్నారు. సీనియర్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు అన్ని వర్గాల నుంచి గౌరవం లభించింది. ఆయన మరణం సినీ, రాజకీయ రంగానికి తీరని లోటు.
Also Read..
భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో మళ్లీ మొదలైన ఆందోళన..
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



