Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో మళ్లీ మొదలైన ఆందోళన..
Stock Markets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అవతలి వైపు నుంచి, అంటే ఇరాన్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాకపోవడం, మరోవైపు అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకుంటుందా అనే సందేహాలతో స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఆందోళన మొదలైంది.
Stock Markets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అవతలి వైపు నుంచి, అంటే ఇరాన్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాకపోవడం, మరోవైపు అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకుంటుందా అనే సందేహాలతో స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఆందోళన మొదలైంది. బుధవారం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కొనసాగుతుండగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 678 పాయింట్లు (0.85 శాతం) పతనమై 78,600 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ50 సూచీ 170 పాయింట్లు (0.70 శాతం) నష్టపోయి 24,400 వద్ద ట్రేడ్ అవుతోంది. గత మూడు సెషన్‌ల నుంచి బుల్ ర్యాలీతో కొనసాగిన సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం విషయంలో స్పష్టత రాకపోవడం, ట్రంప్ మాటి మాటికీ ఇష్టం వచ్చిన ప్రకటనలు చేస్తుండడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన మొదలైంది. హోర్ముజ్ జలసంధిలో అమెరికా విధించిన నౌకా నిర్బంధాన్ని తొలగించే వరకు తాము చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ తేల్చి చెప్పడం కూడా మార్కెట్లపై నెగెటివ్ ప్రభావాన్ని చూపించింది.
స్వల్పంగా తగ్గిన చమురు ధరలు, బలపడ్డ డాలర్..
ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ225 సూచీ 0.5 శాతం పెరగ్గా, దక్షిణ కొరియా కోస్పి సూచీ 0.2 శాతం నష్టపోయింది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ500, ఏఎస్ఎక్స్200 సూచీ 0.9 శాతం క్షీణించింది. అలాగే హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 1.3 శాతం మేర పతనమైంది. చైనా షాంఘై కంపోజిట్ 0.1 శాతం లాభంలో ఉంది. తైవాన్ తైయెక్స్ 1.1 శాతం ర్యాలీ కొనసాగించింది. ఇక నిఫ్టీలో మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్‌జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగిలిన అన్ని రంగాలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరిగినప్పటికీ ముడి చమురు ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.780 డాలర్లు తగ్గి 93.735 వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.710 డాలర్లు తగ్గి 88.705 వద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. 29 పైసలు నష్టపోయిన రూపాయి డాలర్‌కు 93.76 వద్ద ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | మూడో రోజూ దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, ఫార్మా షేర్లలో జోష్..
జులై 3, 2026

Stock Markets | ఐటీ షేర్ల జోరుతో మార్కెట్లకు శుభారంభం.. భారీ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్..
జులై 3, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లోనే.. పెట్టుబడిదారుల్లో ఊపందుకున్న సెంటిమెంట్..
జులై 2, 2026
తాజావార్తలు
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ

Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..

TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు



