Prabhas | గుర్రం పైనుంచి పడిన ప్రభాస్.. ఫౌజీ షూటింగ్లో డార్లింగ్ చేతికి గాయం!
Prabhas | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నుంచి రానున్న తదుపరి సినిమా `ఫౌజీ` (Fauzi). దేశభక్తి నేపథ్యంలో డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Entertainment | Published On Feb 16, 2026, 9.31 am IST
Prabhas | త్రినేత్ర.న్యూస్: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నుంచి రానున్న తదుపరి సినిమా `ఫౌజీ` (Fauzi). దేశభక్తి నేపథ్యంలో డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు చిత్రీకరించాల్సి ఉన్నందని గతంలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓ కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ గాయపడినట్లు తెలుస్తున్నది. గుర్రంపైనుంచి కింద పడ్డారని, దీంతో చేతికి గాయమైందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గాయం చిన్నదేనని, వెంటనే చిత్ర బృందం ప్రథమ చికిత్స అందించారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు రోజులు విశ్రాంతి తర్వాత డార్లింగ్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. న్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ ఓ కొత్త అవతారంలో కనిపిస్తారని సినీవర్గాల్లో టాక్. ఆయన సరసన ఇమాన్వీ (Imanvi) నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ హంగులతో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా కానుకగా విడుదల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రభాస్ గత పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులోనే ఆయన క్యారెక్టర్ ఎలా ఉండనుందో క్లూ కూడా ఇచ్చారు. 'పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు, గురువు లేని ఏకలవ్యుడు, పుట్టుకతోనే అతను ఒక యోధుడు' అని మేకర్స్ సంస్కృతంలో పేర్కొన్నారు. ఈ అప్డేట్తో సినిమాపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది.
సంబంధిత వార్తలు

Actor Prabhas | ఫ్యూచర్ సిటీలో ప్రభాస్‌కు 500 ఎకరాలు..?
నవంబర్ 25, 2026

Chiranjeevi | బాస్ రఫ్ఫాడించడం ఖాయం – ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో – మెగా వెర్స్ ప్రోమో రిలీజ్
నవంబర్ 24, 2026

Prabhas | డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రభాస్.. ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమానికి మద్దతు కోరిన కిషన్‌రెడ్డి
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



