త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NTR | హ్యాపీ బర్త్‌డే మావయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే విషెస్‌

NTR | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 76వ పుట్టినరోజు జ‌రుపుకుటుంన్నారు. ఈ సంద‌ర్భంగా సందర్భంగా హ్యాపీ బ‌ర్త్‌డే మామ‌య్య గారు అంటూ చంద్ర‌బాబుకు హీరో ఎన్టీఆర్ (NTR) జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు (Birthday Wishes) తెలిపారు.

G

Entertainment | Published On Apr 20, 2026, 9.02 am IST

NTR | హ్యాపీ బర్త్‌డే మావయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే విషెస్‌
Advertisement

NTR | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 76వ పుట్టినరోజు జ‌రుపుకుటుంన్నారు. ఈ సంద‌ర్భంగా సందర్భంగా హ్యాపీ బ‌ర్త్‌డే మామ‌య్య గారు అంటూ చంద్ర‌బాబుకు హీరో ఎన్టీఆర్ (NTR) జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు (Birthday Wishes) తెలిపారు. ‘ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండైన ఆరోగ్యం, సంతోషం, బలంతో ప్రజాసేవలో అదే దార్శనికత, అంకితభావతో పనిచేయాలని ఆశిస్తున్నాను. రాష్ట్రం అభివృద్ధి, సుసంపన్నత, ఆత్మగౌరవంతో మీ నాయకత్వం కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని ఎక్స్ వేదికగా ఎన్టీఆర్‌ విషెస్‌ తెలిపారు.

మ‌రోవైపు చంద్ర‌బాబు 76వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అన్న క్యాంటీన్ల‌కు రూ.76 ల‌క్ష‌లు విరాళం అంద‌జేశారు. ఈ మొత్తంతో సోమ‌వారం ఏపీలో ఉన్న 269 అన్న క్యాంటీన్ల‌లో ఉచితంగా భోజ‌నం అందించ‌నున్నారు. `మీ పుట్టిన రోజుకు మేమిచ్చే బ‌హుమానం ఇదే` అంటూ ఆమె చెక్కును చంద్ర‌బాబుకు అందజేశారు.

 

 

Advertisement
Advertisement