Yesha Nagula Song | యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఏష నాగుల సాంగ్.. మాస్ స్టెప్పులతో అదగొట్టిన నాని, కీర్తి సురేశ్
Yesha Nagula Song | దసరా కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని (Nani) హీరోగా నటుస్తున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ (The Paradise). ఈ మూవీ నుంచి వస్తున్న సాంగ్స్ అదరగొడుతున్నాయి.
Entertainment | Published On Aug 30, 2026, 8.17 am IST
Yesha Nagula Song | త్రినేత్ర.న్యూస్: దసరా కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని (Nani) హీరోగా నటుస్తున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ (The Paradise). ఈ మూవీ నుంచి వస్తున్న సాంగ్స్ అదరగొడుతున్నాయి. ఇప్పటికే Aaya Sher సాంగ్ 200 మిలియన్ దాటి రికార్డులు బ్రేక్ చేస్తున్నది. తాజాగా విడుదలైన `ఏష నాగుల` పాట (Yesha Nagula Song) యూటూబ్‌ను ఊపేస్తున్నది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుడటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సినిమాలోని రెండో గీతాన్ని శనివారం విడుదల చేశారు. జనాల్లో ఎంతో ఆదరణ పొందిన `ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల..` అనే జానపద బాణీకి కొత్తదనాన్ని జోడించిన ఈ పాట విడుదలైన దూసుకెళ్తున్నది. 16 గంటల్లోనే 1.7 కోట్ల వ్యూస్ సొంతం చేసుకున్నది.

మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించిన ఈ మాస్ బీట్‌కు నాని, కీర్తి సురేశ్ (Keerthy Suresh) తన స్టెప్స్‌తో ఇరగదీశారు. మాస్ స్టెప్స్‌లో అదరగొట్టడంతో రిలీజైన గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట ట్రెండింగ్ అవుతున్నది. కాసర్ల శ్యామ్ సాహిత్యమందించగా, జంగిరెడ్డి, ప్రభ బంగారిగళ్ల ఆలపించిన ఈ పాటకు ఆట సందీప్ మాస్టర్ తన భార్య జ్యోతి రాజ్‌తో కలిసి కొరియోగ్రఫీ అందించాడు. నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేశ్ బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Kayadu Lohar | నాని ప్యారడైజ్ ఈవెంట్ – కయదు మిస్సింగ్
సెప్టెంబర్ 11, 2026

Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!
సెప్టెంబర్ 9, 2026

The Paradise Movie | ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. ఊహాగానాలకు చెక్ పెట్టిన మూవీ టీమ్..!
సెప్టెంబర్ 6, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



