త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S Janaki | లెజెండ‌రీ సింగ‌ర్ ఎస్ జాన‌కీ ఇంట విషాదం.. త‌న‌యుడు ముర‌ళీకృష్ట క‌న్నుమూత‌..!

S Janaki | లెజెండ‌రీ సింగ‌ర్ ఎస్ జాన‌కీ త‌న‌యుడు ముర‌ళీకృష్ట (65) గురువారం తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ కేఎస్ చిత్ర ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్ల‌డించారు. ఆయ‌న మ‌ర‌ణం త‌న‌ను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని పోస్ట్ పెట్టారు.

P

Entertainment | Published On Jan 22, 2026, 12.20 pm IST

S Janaki | లెజెండ‌రీ సింగ‌ర్ ఎస్ జాన‌కీ ఇంట విషాదం.. త‌న‌యుడు ముర‌ళీకృష్ట క‌న్నుమూత‌..!
Advertisement

S Janaki | లెజెండ‌రీ సింగ‌ర్ ఎస్ జాన‌కీ త‌న‌యుడు ముర‌ళీకృష్ట (65) గురువారం తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ కేఎస్ చిత్ర ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్ల‌డించారు. ఆయ‌న మ‌ర‌ణం త‌న‌ను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని పోస్ట్ పెట్టారు. తాను ప్రేమగ‌ల సోద‌రుడిని కోల్పోయానంటూ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. “ఈ ఉదయం మురళి అన్న (మా ప్రియమైన జానకి అమ్మ ఏకైక కుమారుడు) ఆకస్మిక మరణ వార్త విని నేను షాక్‌కు గుర‌య్యారు.

ప్రేమగల సోదరుడిని కోల్పోయాం. ఈ భరించలేని బాధను, దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మకు శక్తిని ప్రసాదించుగాక. ముర‌ళీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి” అంటూ సోష‌ల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ముర‌ళీకృష్టకు భ‌ర‌త నాట్య‌లో మంచి ప్రావీణ్యం ఉంది. ప‌లువురిని శిక్ష‌ణ సైతం ఇచ్చారు. ఆయ‌న ప‌లు సినిమాల్లో న‌టించారు. వినాయకుడు, మల్లెపువ్వు త‌దిత‌ర చిత్రాల్లో క‌నిపించారు. మలయాళ సినిమా కూలింగ్‌ గ్లాస్ మూవీకి ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కూతులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ముర‌ళీకృష్ట మృతికి సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement