త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S Janaki Net Worth | ఎస్ జాన‌కి మొత్తం ఆస్తుల విలువ ఎన్ని వంద‌ల కోట్లంటే?

అరు ప‌దుల సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో వేలాది గీతాలు ఆల‌పించారు జాన‌కి. తొలి సినిమా కోసం జాన‌కి రెండు వంద‌ల రూపాయ‌లు మాత్ర‌మే రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నారు. ఆ స్థాయి నుంచి ఒక్కో పాట‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు పారితోషికం తీసుకునే స్టేజ్‌కు ఎదిగారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే?

N

Entertainment | Published On Jul 12, 2026, 8.47 am IST

S Janaki Net Worth | ఎస్ జాన‌కి మొత్తం ఆస్తుల విలువ ఎన్ని వంద‌ల కోట్లంటే?
Advertisement

S Janaki Net Worth | త‌న సుమ‌ధుర గాత్రం ఐదారు త‌రాల సంగీత ప్రియుల‌ను మెప్పించింది ఎస్ జాన‌కి. డ్యూయెట్లు, విషాద గీతాలు, భ‌క్తి ...ఇలా పాట ఏదైనా త‌న గ‌ళంతో ప్రాణం పోసేవారు. తెలుగులోనే కాకుండా ప‌దిహేడు భాష‌ల్లో పాట‌లు పాడారు. కేవ‌లం గాయ‌నిగానే కాకుండా సంగీత ద‌ర్శ‌కురాలిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో అజాత‌శ‌త్రువుగా వివాదాల‌కు దూరంగా త‌న జీవితాన్ని గ‌డిపారు.

రెండు వంద‌ల నుంచి...

గాయ‌నిగా జాన‌కి సినీ ప్ర‌యాణం 1957లో మొద‌లైంది. దాదాపు అర‌వై ఏళ్ల పాటు సింగ‌ర్‌గా కొన‌సాగారు. ఒక్క తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో టాప్ సింగ‌ర్‌గా ఓ వెలుగు వెలిగారు. అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న ఫిమేల్ సింగ‌ర్‌గా రికార్డ్ నెల‌కొల్పారు. తొలి పాట పాడినందుకు ఆమె తీసుకున్న పారితోషికం కేవ‌లం రెండు వంద‌లు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత త‌న రెమ్యూన‌రేష‌న్‌ను పెంచుతూ వ‌చ్చారు. ఒకానొక ద‌శ‌లో ఒక్కో పాట‌కు ల‌క్ష‌ల్లో రెమ్యూన‌రేష‌న్ తీసుకునే స్థాయికి ఎదిగారు.

మొత్తం ఆస్తుల విలువ‌...

జాన‌కి మొత్తం ఆస్తుల విలువ 537 కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. సింగ‌ర్‌గానే కాకుండా రియ‌ల్ ఎస్టేట్స్‌, భూముల్లో ఆమె కుటుంబం భారీగానే పెట్టుబ‌డులు పెట్టింద‌ట‌.

ప‌ద్మభూష‌ణ్ తిర‌స్క‌ర‌ణ‌

2013లో సినీ రంగానికి చేసిన సేవ‌ల‌కు గాను జాన‌కికి కేంద్ర ప్ర‌భుత్వ ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించింది. కానీ ఈ అవార్డును జాన‌కి తిర‌స్క‌రించారు. యాభై ఏళ్ల‌కుపైగా పాట‌లు పాడిన త‌ర్వాత వ‌చ్చిన ఈ అవార్డు త‌న‌కు అక్క‌ర‌లేద‌ని అన్నారు. ఉత్త‌రాది గాయ‌నీగాయ‌కుల‌తో పోలిస్తే ద‌క్షిణాది క‌ళాకారుల‌పై చాలా వివ‌క్ష ఉందంటూ అప్ప‌ట్లో జాన‌కి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి.

 

Advertisement
Advertisement