త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janaki | అక్షరం ముక్క రాకపోయినా గేయ‌ర‌చ‌యిత‌గా మెప్పించిన గానకోకిల!

అక్షర జ్ఞాన లేక‌పోయినా తెలుగుతో పాటు త‌మిళంలో జాన‌కి వంద‌లాది పాట‌లు రాశారు. ఎక్కువ‌గా భ‌క్తి గీతాల‌కు సాహిత్యం అందించారు. జాన‌కిది ప్రేమ వివాహం. ఆమె కొడుకు ముర‌ళీకృష్ణ కూడా కొన్ని సినిమాల్లో న‌టించాడు.

N

Entertainment | Published On Jul 12, 2026, 10.05 am IST

Janaki | అక్షరం ముక్క రాకపోయినా గేయ‌ర‌చ‌యిత‌గా మెప్పించిన గానకోకిల!
Advertisement

Janaki | గాన‌కోకిల జాన‌కి ప‌దిహేడు భాష‌ల్లో పాట‌లు పాడారు. ఏ భాష‌లో పాట‌పాడిన అదే ఆమె మాతృభాష అనేంత‌గా యాస‌, ప‌దాల ఉచ్చార‌ణ విష‌యంలో జాగ్ర‌త్త తీసుకునేవారు.కేవ‌లం గాయ‌నిగానే కాకుండా ర‌చ‌యిత‌గా వంద‌లాది భ‌క్తి గీతాలు రాశారు. తెలుగులోనే కాకుండా త‌మిళ పాట‌ల‌కు సాహిత్యం అందించారు. అక్ష‌ర‌జ్ఞాన‌లేక‌పోయినా ఆమె ఈ పాట‌ల‌ను రాయ‌డం గ‌మ‌నార్హం. జాన‌కి అస‌లు చ‌దువుకోలేదు. ఇదే విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో జాన‌కి తెలిపింది. తాను అస‌లు బ‌డికే వెళ్ల‌లేద‌ని అన్న‌ది. అక్షర జ్ఞానం లేకపోయినా, పక్కన ఉన్నవారు రాసి ఇచ్చిన , విన్న ప‌దాల‌ను సరిగ్గా గుర్తుంచుకుంటూ ఆయా భాషల్లోని ఉచ్ఛారణను స్పష్టంగా పలుకుతూ పాట‌లు పాడేదానిని అని జాన‌కి చెబుతుండేవారు.

త‌మిళంలో...

త‌మిళంలో ఓ సినిమా కోసం క‌న్నా నీ ఎంగే అనే పాట‌ను రాశారు. ఈ పాటను కృష్ణా నువ్వెక్క‌డగా తెలుగులోనూ జాన‌కినే అనువ‌దించారు. తెలుగులో శ్రీకృష్ణుడు, సాయిబాబాల‌పై వంద‌లాది భ‌క్తి గీతాలు రాశారు.

జాన‌కిది ప్రేమ వివాహం....

జాన‌కిది ప్రేమ వివాహం. వైద్యుల‌ రాంప్ర‌సాద్‌ను ప్రేమించి పెళ్లాడారు. రాంప్ర‌సాద్ ఫొటో ఒక‌టి ర‌హ‌స్యంగా చాలా కాలం పాటు త‌న ద‌గ్గ‌రే దాచుకున్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో జాన‌కి తెలిపింది. ఆ ఫొటో అనుకోకుండా ఓ సారి బ‌య‌ట‌ప‌డ‌టంతో వారి ప్రేమాయ‌ణం గురించి ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కు తెలిసిపోయింద‌ని అన్న‌ది. అలా రాంప్ర‌సాద్‌తో త‌న పెళ్లి జ‌రిగిపోయింద‌ని చెప్పింది. జాన‌కి పాట‌లు పాడితే ఆమె రెమ్యూన‌రేష‌న్లు, రాయ‌ల్టీ విష‌యాలు మొత్తం భ‌ర్త‌నే చూసుకునేవారు. జాన‌కి బాట‌లోనే ఆమె కొడుకు ముర‌ళీకృష్ణ కూడా సినిమాల్లోకి వ‌చ్చాడు. మ‌ల్లెపూవు, శృతి ల‌య‌లు, వినాయ‌కుడుతో పాటు కొన్ని సినిమాల్లో యాక్ట‌ర్‌గా న‌టించాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో గుండెపోటుతో ముర‌ళీకృష్ణ క‌న్నుమూశాడు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే జాన‌కి మ‌న‌వ‌డు కూడా మ‌ర‌ణించాడు. ఈ వ‌రుస మ‌ర‌ణాల‌తో జాన‌కి కృంగిపోయారు.

 

Advertisement
Advertisement