త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | మ‌ళ్లీ సుప్రీంకోర్టుకు ‘జ‌న నాయ‌గ‌న్‌’..! మూవీ రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్ అయ్యేనా..?

Jana Nayagan | త‌మిళ న‌టుడు విజ‌య్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన జ‌న నాయ‌గ‌న్ మూవీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. పొలిటిక‌ల్ ఎంట్రీ నేప‌థ్యంలో ఇదే చివ‌రి సినిమాగా భావిస్తుండ‌గా.. అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

P

Entertainment | Published On Jan 30, 2026, 7.02 pm IST

Jana Nayagan | మ‌ళ్లీ సుప్రీంకోర్టుకు ‘జ‌న నాయ‌గ‌న్‌’..! మూవీ రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్ అయ్యేనా..?
Advertisement

Jana Nayagan | త‌మిళ న‌టుడు విజ‌య్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన జ‌న నాయ‌గ‌న్ మూవీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. పొలిటిక‌ల్ ఎంట్రీ నేప‌థ్యంలో ఇదే చివ‌రి సినిమాగా భావిస్తుండ‌గా.. అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సెన్సార్ వివాదంలో చిక్కుకోగా.. రిలీజ్‌పై స‌స్పెన్స్ కొన‌సాగుతున్న‌ది. మేక‌ర్స్ హైకోర్టును ఆశ్ర‌యించినా ఇప్ప‌టికీ ఉప‌శ‌మ‌నం దొర‌క‌లేదు. తాజాగా మ‌రోసారి మేక‌ర్స్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

సెన్సార్ స‌ర్టిఫికెట్ కోసం నిర్మాత‌లు మ‌రోసారి సుప్రీంకోర్టు త‌లుపుత‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇప్ప‌టికే సుప్రీంకోర్టులో కేవియ‌ట్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఉత్త‌ర్వులు జారీ చేసే ముందు త‌మ వాద‌న‌లు వినాల‌ని సుప్రీంకోర్టును సీబీఎఫ్‌సీ కోరింది. జ‌న నాయ‌గ‌న్ మూవీని కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. ఈ నెల 27న జ‌న నాయ‌గ‌న్ చిత్రానికి యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని సీబీఎఫ్‌సీని ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ గతంలో ఇచ్చిన ఉత్తర్వును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్ర‌మంలో సెన్సార్ వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు హైకోర్టు నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ నిర్మాత‌లు, కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని ఓ నివేదిక తెలిపింది.

గ‌తంలోనూ సుప్రీంకోర్టును మేక‌ర్స్ ఆశ్ర‌యించ‌గా.. సెన్సార్ బోర్డు నుంచి అనుమతి కోరుతూ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు నిరాక‌రించింది. జ‌న‌వ‌రి 15న మ‌ద్రాస్ హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించాల‌ని సుప్రీంకోర్టు నిర్మాత‌ల‌ను ఆదేశించింది. నిర్మాత‌ల పిటిష‌న్‌పై విచారించేందుకు నిరాక‌రించ‌డంతో పాటు మ‌ద్రాస్ హైకోర్టును ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుప్రీం ఆదేశించింది. జన నాయగ‌న్ నిర్మాత‌లు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై 20వ తేదీలోగా తీర్పు ఇవ్వాల‌ని మద్రాస్ హైకోర్టును సుప్రీం ఆదేశించింది. హైకోర్టులోనూ అనుకూల తీర్పును రాక‌పోవ‌డంతో నిర్మాత‌లు మ‌ళ్లీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని నివేదిక తెలిపింది.

వాస్త‌వానికి జ‌న నాయ‌గ‌న్ మూవీ జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ బోర్డు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో రిలీజ్ ఆల‌స్య‌మైంది. మద్రాస్ హైకోర్టు ఈ నెల 20న కేసును విచారించిన విష‌యం తెలిసిందే. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు తీర్పును రిజ‌ర్వ్ చేసింది. 27న సింగిల్ బెంచ్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేస్తూ తీర్పును వెలువ‌రించింది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలోనైనా ఊర‌ట ద‌క్కుతుందా? లేదా? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement