త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh Buddymoon | థాయ్‌లాండ్‌లో ‘బడ్డీమూన్’ ఎంజాయ్ చేస్తున్న రష్మిక – విజయ్ దేవరకొండ.. రోజుకు అద్దె రూ.2.5 లక్షలు!

పెళ్లి తర్వాత రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ తమ స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లోని కో సముయ్ (Koh Samui) దీవిలో ఎంజాయ్ చేస్తున్నారు. రోజుకు రూ.2.5 లక్షల అద్దె ఉన్న ఈ లగ్జరీ విల్లాలో వాళ్లు స్టే చేస్తున్నారు.

J

Entertainment | Published On Mar 25, 2026, 3.57 pm IST

Virosh Buddymoon | థాయ్‌లాండ్‌లో ‘బడ్డీమూన్’ ఎంజాయ్ చేస్తున్న రష్మిక – విజయ్ దేవరకొండ.. రోజుకు అద్దె రూ.2.5 లక్షలు!
Advertisement
  • ఇటీవలే ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా
  • ప్రస్తుతం స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లో 'బడ్డీమూన్' (Buddymoon) ఎంజాయ్ చేస్తున్న జంట
  • కో సముయ్ ప్రాంతంలోని 'Koh Koon' అనే లగ్జరీ విల్లాలో బస.
  • అత్యాధునిక సౌకర్యాలున్న ఈ విల్లాలో మూడు రాత్రులకు ఏకంగా రూ.7.8 లక్షల అద్దె

Virosh Buddymoon | త్రినేత్ర.న్యూస్ : ఇటీవలే ఉదయ్‌పూర్‌లో ఘనంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ.. ఇప్పుడు తమ స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత స్నేహితులతో కలిసి జరుపుకునే ఈ 'బడ్డీమూన్' (vacation with friends after wedding) విశేషాలను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రముఖ సంస్థ Airbnbతో కలిసి ఈ కొత్త యాడ్‌ను రూపొందించారు.

ఆ లగ్జరీ విల్లా విశేషాలు ఇవే..

విజయ్, రష్మిక థాయ్‌లాండ్‌లోని రెండవ అతిపెద్ద ద్వీపమైన కో సముయ్ (Koh Samui)లోని అత్యంత విలాసవంతమైన 'కో కూన్' (Koh Koon) విల్లాలో బస చేస్తున్నారు. చవెంగ్ నోయ్ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ 7+2 బెడ్‌రూమ్ విల్లా..  ప్రకృతి అందాల కలయికగా నిలుస్తుంది. విశాలమైన డైనింగ్ స్పేస్, ప్రశాంతమైన వాతావరణం, అన్నింటికంటే మించి సముద్రపు అందాలను చూస్తూ ఎంజాయ్ చేసేలా ఉన్న అద్భుతమైన వ్యూ ఈ విల్లా ప్రత్యేకత.

అయితే, ఈ విల్లాలో ఉండాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. ఇక్కడ మూడు రాత్రులకు ఏకంగా రూ.7.8 లక్షల అద్దె చెల్లించాలి (అంటే రోజుకు సుమారు రూ.2.5 లక్షలు). బుకింగ్ సమయంలో 1,500 డాలర్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

Inside Rashmika and Vijay Deverakonda Luxurious Thailand Buddymoon Airbnb Costs rs.2.5 Lakh Per Night

ఇంకా అలవాటు పడుతున్నాను: రష్మిక

ఈ బడ్డీమూన్ వీడియోలో రష్మిక మాట్లాడుతూ.. విజయ్‌ని 'నా భర్త' అని పిలవడానికి తాను ఇంకా అలవాటు పడుతున్నానని సిగ్గుపడుతూ చెప్పింది. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం, డాన్స్ చేయడం, తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. "ఇంకో ఐదేళ్ల తర్వాత మనం ఏం చేస్తుంటాం?" అని విజయ్ అడగ్గా.. "ప్రపంచం మొత్తం చుట్టేస్తుంటాం, ఇలాంటి మరిన్ని అందమైన ప్రదేశాలను వెతుకుతుంటాం" అని రష్మిక బదులిచ్చింది.

"పెళ్లి వేడుకల తర్వాత, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలనుకున్నాం. ఉదయం ప్రశాంతత, మధ్యాహ్నం స్విమ్మింగ్, సాయంత్రం పూల్, టేబుల్ టెన్నిస్ ఆడుతూ.. రాత్రుళ్లు నవ్వులు చిందిస్తూ మూవీ నైట్స్ గడిపాం. స్నేహితులతో కలిసి గడిపిన ఈ కో సముయ్ మాకు సొంత ఇల్లులా అనిపించింది" అంటూ రష్మిక క్యాప్షన్ ఇచ్చింది.

రెండు సంప్రదాయాల్లో వివాహం

గత ఏడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఫిబ్రవరిలో తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ (తెలుగు), రష్మిక (కొడవ - కూర్గ్) సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement