త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajamouli | శ్రీకృష్ణుడి పాత్ర‌లో డైరెక్ట‌ర్ రాజ‌మౌళి – స‌గం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఆగిపోయిన మైథాల‌జీ మూవీ

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చిన్న‌త‌నంలో ఓ బాల‌ల సినిమాలో హీరోగా న‌టించారు. మైథాల‌జీ జాన‌ర్‌లో రూపొందిన ఈ మూవీలో చిన్ని కృష్ణుడిగా క‌నిపించారు. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌గం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత మ‌ధ్య‌లో ఆగిపోయింది.

N

Entertainment | Published On Oct 10, 2026, 7.55 pm IST

Rajamouli | శ్రీకృష్ణుడి పాత్ర‌లో డైరెక్ట‌ర్ రాజ‌మౌళి – స‌గం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఆగిపోయిన మైథాల‌జీ మూవీ
Advertisement

Rajamouli | దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి శ‌నివారం నాడు త‌న 53వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు. ఆయ‌నకు ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ స్టార్స్ బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. రాజ‌మౌళితో త‌మ‌కున్న అనుబంధాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌...

తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వ‌ర‌కు తీసుకెళ్లారు రాజ‌మౌళి. తెలుగు సినిమాలు వంద కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డ‌మే గొప్ప అని చెప్పుకునే స్థాయి నుంచి వెయ్యి, రెండు వేల కోట్లు కూడా సాధించ‌గ‌ల‌వ‌ని రాజ‌మౌళి నిరూపించారు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా యాభై రూపాయ‌ల రెమ్యూన‌రేష‌న్‌తో రాజ‌మౌళి కెరీర్ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనే అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న ద‌ర్శ‌కుడు ఆయ‌నే. శాంతినివాసం సీరియ‌ల్‌తో ద‌ర్శ‌కుడిగా మారారు. స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నారు.

బాలల సినిమా...

హీరోగా కూడా రాజ‌మౌళి ఓ సినిమా చేశారు. అయితే ఇది బాల‌ల సినిమా. చిన్న‌త‌నంలో రాజ‌మౌళి హీరోగా ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ పిల్ల‌న‌గ్రోవి పేరుతో ఓ సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ బాల‌ల సినిమాకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌తో పాటు కీర‌వాణి తండ్రి శివ‌శ‌క్తి ద‌త్తా ద‌ర్శ‌కులుగా ప‌నిచేశారు. వారే ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమాలో చిన్నికృష్ణుడిగా రాజ‌మౌళి క‌నిపించారు. రాజ‌మౌళి కుటుంబ‌స‌భ్యులంద‌రూ సినిమాకు టెక్నీషియ‌న్లు, యాక్ట‌ర్లుగా ప‌నిచేశారు. కీర‌వాణి మ్యూజిక్ అందించారు. స‌గానికిపైగా షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ సినిమా ఆగిపోయింది. అలా రాజ‌మౌళి డెబ్యూ మూవీ రిలీజ్‌కు నోచుకోలేదు.

వార‌ణాసి...

ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబుతో వార‌ణాసి సినిమా చేస్తోన్నారు రాజ‌మౌళి. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో అడ్వెంచ‌ర్ టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. వార‌ణాసిలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

 

Advertisement
Advertisement