త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prakash Raj | నాలుగు రాష్ట్రాల్లో ఓటుహ‌క్కు.. ప్రకాశ్‌రాజ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

Prakash Raj | సామాజిక అంశాలపై స్పందిస్తూ అత‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా వెల్ల‌డించే ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఓట‌రు గుర్తింపు కార్డులు (Voter ID Cards) క‌లిగి ఉన్నారంటూ దాఖ‌లైన కేసులో ఆయ‌న‌కు నాన్‌బెయిల‌బుల్ వారెంట్ (Non Bailable Warrant) జారీ అయింది.

G

Entertainment | Published On Jun 22, 2026, 10.27 am IST

Prakash Raj | నాలుగు రాష్ట్రాల్లో ఓటుహ‌క్కు.. ప్రకాశ్‌రాజ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌
Advertisement

Prakash Raj | త్రినేత్ర‌.న్యూస్‌: సామాజిక అంశాలపై స్పందిస్తూ అత‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా వెల్ల‌డించే ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఓట‌రు గుర్తింపు కార్డులు (Voter ID Cards) క‌లిగి ఉన్నారంటూ దాఖ‌లైన కేసులో ఆయ‌న‌కు నాన్‌బెయిల‌బుల్ వారెంట్ (Non Bailable Warrant) జారీ అయింది. బెంగ‌ళూరులోని 48వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ మేర‌కు ఉత్తర్వులను జారీ చేసింది.

ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిబంధనల ప్రకారం.. దేశంలోని ఏ పౌరుడైనా కేవలం ఒకే ఒక్క ఓటర్ ఐడీ కార్డును కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం. అయితే ప్రకాశ్‌రాజ్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఓటు హ‌క్కు క‌లిగి ఉన్నారని, ఆయ‌న పేరుపై వేర్వేరు ఓటర్ ఐడీలను కలిగి ఉన్నారంటూ దిలీప్ కుమార్ అనే న్యాయ‌వాది బెంగళూరులో హ‌లసూరు గేట్ పోలీస్‌స్టేష‌న్‌లో 2019లో ఫిర్యాదు చేశారు. అనంత‌రం బీబీఎంపీ అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా స్పందించ‌కపోవడంతో మెట్రోపాలిట‌న్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో పూర్తి ఆధారాలు స‌మ‌ర్పించ‌డంతో విచార‌ణ‌కు స్వీక‌రించింది.

ఈ క్ర‌మంలో గ‌తంలో కోర్డు ఆయ‌న‌కు రెండుసార్లు అధికారిక స‌మ‌న్లు జారీచేసింది. అయిన‌ప్ప‌టికీ విచారణకు హాజరుకాలేదు. దీంతో రెండుసార్లు నాన్‌-బెయిలబుల్‌ వారెంట్లు ఇచ్చింది. అయినా ఎలాంటి స్పంద‌న లేకపోవ‌డంతో తాజాగా మూడోసారి నాన్‌-బెయిల‌బుల్ వారెంట్ ఇష్యూ చేసింది.

Advertisement
Advertisement