త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss Shanmukh | ప్రియురాలితో ఏడ‌డుగులు వేసిన తెలుగు బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ – పెళ్లి ఫొటోలు వైర‌ల్‌

బిగ్‌బాస్ తెలుగు ర‌న్న‌ర‌ప్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రియురాలు వైష్ణ‌వి మెడ‌లో మూడుముళ్లు వేశాడు. ష‌ణ్ముఖ్‌, వైష్ణ‌వి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Jun 22, 2026, 11.39 am IST

Bigg Boss Shanmukh | ప్రియురాలితో ఏడ‌డుగులు వేసిన తెలుగు బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ – పెళ్లి ఫొటోలు వైర‌ల్‌
Advertisement

Bigg Boss Shanmukh | తెలుగు బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఓ ఇంటివాడ‌య్యారు. ప్రియురాలు వైష్ణ‌వి చోడిశెట్టి మెడ‌లో మూడుముళ్లు వేశాడు. ఆదివారం తిరుమ‌ల లో వీరి పెళ్లి వేడుక‌ జ‌రిగింది.  ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కొద్ది మంది స‌న్నిహితులు, కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో ష‌ణ్ముఖ్‌, వైష్ణ‌వి పెళ్లి జ‌రిగిన‌ట్లు స‌మాచారం. జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతోన్నారు. ఈ ఏడాది ఆరంభంలో త‌న ప్రియురాలు వైష్ణ‌విని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశాడు ష‌ణ్ముఖ్‌. ఆమెతో ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించాడు.

తెలుగు బిగ్‌బాస్‌...

యూట్యూబ‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5తో ఫేమ‌స్ అయ్యాడు. ఈ సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ షోకు వెళ్ల‌డానికి ముందు దీప్తి సున‌య‌న‌తో ష‌ణ్ముఖ్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. వీరిద్ద‌రు క‌లిసి కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ చేశారు. సోష‌ల్ మీడియాలో జంట‌గా ఫొటోలు షేర్ చేయ‌డం, సాంగ్స్‌లో వీరిద్ద‌రి కెమిస్ట్రీ చూసి ప్రేమాయ‌ణం నిజ‌మేన‌ని అభిమానులు భావించారు. కానీ బిగ్‌బాస్ హౌజ్‌లో ష‌ణ్ముఖ్‌...సిరి హ‌నుమంతుతో క్లోజ్‌గా క‌నిపించాడు. సిరి హ‌నుమంతు కార‌ణంగా ష‌ణ్ముఖ్, దీప్తి సున‌య‌న ల‌వ్‌స్టోరీకి బ్రేక‌ప్ ప‌డింది.

వెబ్ సిరీస్‌లు....

షార్ట్‌ఫిల్మ్స్‌, ఇండిపెండెంట్ సాంగ్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌, ఏజెంట్ ఆనంద్ సంతోష్‌, లీలా వినోదం వంటి వెబ్‌సిరీస్‌ల‌లోనూ ష‌ణ్ముఖ్ న‌టించాడు. హీరోగా ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తున్నాడు.  వెబ్ సిరీస్‌ల‌ కంటే వివాదాల‌తోనే అప్ప‌ట్లో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచాడు. డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు ష‌ణ్ముక్‌.

Advertisement
Advertisement