Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda | ఈ వినయక చవితిని (Vinayaka Chavithi) పర్యావరణ హితంగా జరుపుకోవాలని రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పిలుపునిచ్చారు. అందరూ సురక్షితమైన మట్టి గణపతి, విత్తన గణపతిని వాడాలని.. తద్వారా మన నగరం కలుషితం కాదన్నారు.
Entertainment | Published On Sep 10, 2026, 8.46 am IST
Vijay Devarakonda | త్రినేత్ర.న్యూస్: ఈ వినయక చవితిని (Vinayaka Chavithi) పర్యావరణ హితంగా జరుపుకోవాలని రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పిలుపునిచ్చారు. అందరూ సురక్షితమైన మట్టి గణపతి, విత్తన గణపతిని వాడాలని.. తద్వారా మన నగరం కలుషితం కాదన్నారు. గ్రీన్ ఇండియా చాలెంట్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విత్తన గణపతి (Seed Ganesha) ప్రతిమను విజయ్ దేవరకొండకు అందేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. రాబోయే వినాయక చవితిని మట్టి గణపతి, విత్తన గణపతితో జరుపుకోవాలని, నగరాన్ని, నీటి వనరులను కలుషితం చేయకూడదచెప్పారు. సహజ పాత్రలో ఉన్న విత్తన గణపతిని చూపిస్తూ.. తాను ఇప్పుడే విత్తన గణపతిని స్వీకరించానని చెప్పారు. పూజల తర్వాత ఈ విగ్రహం నుంచి మొక్క పెరుగుతుందని తెలిపారు.
`అందరూ సురక్షితమైన మట్టి గణపతి, విత్తన గణపతిని వాడాలని పిలుపునిస్తున్నాను. అలా చేస్తే మన నగరం కలుషితం కాదు. మంచి మొక్క కూడా సిద్ధమవుతుంది` అని విజయ్ దేవరకొండ చెప్పారు. ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
సీడ్ గణపతి..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోత్సహిస్తున్న విత్తన గణపతి విగ్రహాలు సహజ మట్టి, కోకోపీట్, కొబ్బరి పీచుతో తయారు. వాటిలో వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలు ఉంటాయి. పూజలు పూర్తయిన తర్వాత ఇంట్లోనే మట్టిలో నిమజ్జనం చేస్తే మట్టి కరిగి, విత్తనాలు మొలకెత్తి మొక్కగా మారతాయి. విత్తన గణపతి ప్రచారం భక్తిని పర్యావరణ బాధ్యతతో కలుపుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగుల విగ్రహాల వల్ల చెరువులు, నదులు కలుషితం కాకుండా నివారించడమే లక్ష్యం.
తెలంగాణ హరితహారం స్ఫూర్తితో 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నినాదం: మూడు మొక్కలు నాటండి, మూడేళ్లు పెంచండి, మరో ముగ్గురిని నామినేట్ చేయండి. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, సహ వ్యవస్థాపకులు, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కుటుంబాలకు విత్తన గణపతి అందజేస్తూ ఈ సందేశం ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, దేవాలయాలు, పబ్లిక్ పందిరి నిర్వాహకులు మట్టి, విత్తన గణపతినే ఎంచుకోవాలని, పండుగ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేసి, శ్రీ గణేశుడి నుంచి పుట్టిన మొక్కను పెంచాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ పిలుపునిచ్చింది.
సంబంధిత వార్తలు

Seed Ganesha | పర్యావరణ హిత వినాయకోత్సవం.. సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే, సంపత్ నంది
సెప్టెంబర్ 9, 2026

VC Sajjanar | ఆన్లైన్లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
సెప్టెంబర్ 8, 2026

Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | Joining 80’s trend.. రెట్రో లుక్‌లో సీఎం రేవంత్
- ●బియ్యం కాగితంపై మొదలై.. వాల్ స్ట్రీట్ స్క్రీన్లకు చేరిన జపనీస్ ‘క్యాండిల్స్టిక్’ విప్లవం!
- ●Stock Markets | క్రూడ్ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..
- ●Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం
- ●Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర
- ●Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!

Revanth Reddy | Joining 80’s trend.. రెట్రో లుక్‌లో సీఎం రేవంత్

బియ్యం కాగితంపై మొదలై.. వాల్ స్ట్రీట్ స్క్రీన్లకు చేరిన జపనీస్ ‘క్యాండిల్స్టిక్’ విప్లవం!

Stock Markets | క్రూడ్ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..

Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం



