త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalm OTT | తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం యాక్ష‌న్ కామెడీ మూవీ – గ్యాంగ్‌స్ట‌ర్‌గా మోహ‌న్ లాల్‌

మ‌ల‌యాళం మూవీ భాభాబా తెలుగులోకి వ‌చ్చింది. ఈ యాక్ష‌న్ కామెడీ మూవీ తెలుగు వెర్ష‌న్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మోహ‌న్‌లాల్‌, దిలీప్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

N

Entertainment | Published On Jan 27, 2026, 7.13 pm IST

Malayalm OTT | తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం యాక్ష‌న్ కామెడీ మూవీ – గ్యాంగ్‌స్ట‌ర్‌గా మోహ‌న్ లాల్‌
Advertisement

Malayalm OTT |  మ‌ల‌యాళం యాక్ష‌న్ కామెడీ మూవీ భాభాబా తెలుగులో రిలీజైంది. దిలీప్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో మ‌ల‌యాళం టాప్ స్టార్ మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇటీవ‌ల ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. జీ5 ఓటీటీలో కేవ‌లం మ‌ల‌యాళ వెర్ష‌న్‌ను మాత్ర‌మే రిలీజ్ చేశారు. మంగ‌ళ‌వారం నుంచి తెలుగు వెర్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ మేర‌కు జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

యాభై కోట్ల క‌లెక్ష‌న్స్‌...

యాక్ష‌న్ కామెడీగా రూపొందిన భాభాబా సినిమాకు ధ‌నంజ‌య్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థియేట‌ర్ల‌లో ఈ మూవీ యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాకు మ‌ల‌యాళ హీరో బాసిల్ జోసెఫ్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఇందులో వినీత్ శ్రీనివాస‌న్‌, ధ్యాన్ శ్రీనివాస‌న్, ఎస్‌జే సూర్య‌ ముఖ్య పాత్ర‌లు పోషించారు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా హీరోయిన్ లేకుండా ఈ సినిమాను రూపొందించారు.రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లోని అవినీతిని సెటైరిక‌ల్‌గా ఈసినిమాలో చ‌ర్చించారు డైరెక్ట‌ర్‌.

సీఏం కిడ్నాప్‌...

కేర‌ళ సీఏం జోసెఫ్‌ను ఓ బ‌హిరంగ‌స‌భ నుంచి కామ‌న్ మ్యాన్ అని పిల‌వ‌బ‌డే వ్య‌క్తి కిడ్నాప్ చేస్తాడు. సీఏం త‌న‌యుడు నోబుల్‌ ఈ కిడ్నాప‌ర్ గురించి అన్వేషిస్తుంటాడు. ఈ క్ర‌మంలో కామ‌న్‌మ్యాన్ అస‌లు పేరు రాజా దామోద‌ర్ అలియాస్ రాడార్ అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. ముఖ్య‌మంత్రిని రాడార్ ఎందుకు కిడ్నాప్ చేశాడు. రాడార్ వెన‌కున్న గిల్లీ బాలా ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

మోహ‌న్‌లాల్‌పై విమ‌ర్శ‌లు...

భాభాబా మూవీలో మోహ‌న్‌లాల్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డంపై మ‌ల‌యాళ ఆడియెన్స్ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. న‌టి భావ‌న కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసులో ప్ర‌ధాన నిందితుడిగా దిలీప్‌ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఈ కేసులో అత‌డిని నిర్దోషిగా పేర్కొంటూ ఇటీవ‌ల కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వ‌చ్చిన కొద్ది రోజుల త‌ర్వాతే భాభాబా విడుద‌లైంది. ఇందులో కిడ్నాప్ స‌న్నివేశాల‌ను ఫ‌న్నీగా చూపించారు. దిలీప్‌తో క‌లిసి మోహ‌న్‌లాల్ న‌టించిన సీన్ల‌ను ట్రోల్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement