త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anil Ravipudi | అనిల్ రావిపూడికి ల‌గ్జ‌రీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన మెగాస్టార్ – ధ‌ర ఎంతంటే?

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుతో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందించిన డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చారు చిరంజీవి. మూడున్న‌ర కోట్ల విలువైన రేంజ్ రోవ‌ర్ కారును బ‌హుమ‌తిగా అంద‌జేశారు.

N

Entertainment | Published On Jan 25, 2026, 8.35 pm IST

Anil Ravipudi | అనిల్ రావిపూడికి ల‌గ్జ‌రీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన మెగాస్టార్ – ధ‌ర ఎంతంటే?
Advertisement

Anil Ravipudi | చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రిలీజై ప‌ద‌మూడు రోజులు అవుతోన్న ఇప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది.

రేంజ్ రోవ‌ర్ కారు...

త‌న‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు ఇచ్చిన అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. రేంజ్ రోవ‌ర్ స్పోర్ట్స్ కారును బ‌హుమ‌తిగా అంద‌జేశారు. త‌న నివాసంలో అనిల్ రావిపూడికి చిరంజీవి స్వ‌యంగా కారు అంద‌జేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.
మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ స‌క్సెస్ మీట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు చిరంజీవి గిఫ్ట్‌గా ఇచ్చిన కారులోనే అనిల్ రావిపూడి వ‌చ్చారు. అనిల్ రావిపూడికి చిరంజీవి ఇచ్చిన రేంజ్ రోవ‌ర్ స్పోర్ట్స్ కారు ధ‌ర మూడు కోట్ల న‌ల‌భై ల‌క్ష‌ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం.

న‌య‌న‌తార హీరోయిన్‌...

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. మ‌రో టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు వెంక‌టేష్ గెస్ట్ రోల్ చేశారు. చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఫ‌స్ట్ తెలుగు మూవీ ఇది. కేథ‌రిన్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఫ‌స్ట్ హిట్‌...

దూర‌మైన భార్యాపిల్ల‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ఓ సెక్యూరిటీ ఆఫీస‌ర్ ఎలాంటి ప్లాన్స్ వేశాడ‌నే పాయింట్‌తో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు రూపొందింది. ఈ సినిమాలో చిరంజీవి యాక్టింగ్‌, ఆయ‌న స్వాగ్‌తో పాటు పాట‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లు మూవీకి హైలైట్‌గా నిలిచాయి. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను సాహు గార‌పాటితో క‌లిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించింది. నిర్మాత‌గా కూడా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుతో సుస్మిత తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకుంది.

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement