త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | మెగా 158 నుంచి సాలిడ్ అప్‌డేట్ – చిరంజీవి లుక్ టెస్ట్ కంప్లీట్‌

చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మెగా 158 నుంచి సాలిడ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి మెగాస్టార్ లుక్ టెస్ట్ కంప్లీట్ అయిన‌ట్లు డైరెక్ట‌ర్ బాబీ మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Apr 28, 2026, 1.33 pm IST

Chiranjeevi | మెగా 158 నుంచి సాలిడ్ అప్‌డేట్ – చిరంజీవి లుక్ టెస్ట్ కంప్లీట్‌
Advertisement

Chiranjeevi |  వాల్తేర్ వీర‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ రాబోతుంది. మెగా 158 అనే వ‌ర్కింగ్ టైటిట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై సాలిడ్ అప్‌డేట్‌ను డైరెక్ట‌ర్ బాబీ రివీల్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మెగాస్టార్ లుక్ టెస్ట్ కంప్లీట్ అయిన‌ట్లు వెల్ల‌డించారు.

సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌...

ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు బాబీ. చిరంజీవి లుక్ ప‌ర్‌ఫెక్ట్‌ అన్న‌ట్లుగా డైరెక్ట‌ర్ బాబీ థంబ్ సింబ‌ల్ చూపిస్తూ ఈ ఫొటోలో క‌నిపిస్తున్నారు. మెగాస్టార్ లుక్‌ మాత్రం ఈ ఫొటోలో రివీల్ చేయ‌లేదు. డ్రెస్సింగ్ హెయిర్‌స్టైల్ చూస్తుంటే సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో చిరంజీవి క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో త‌న ఏజ్‌కు త‌గ్గ క్యారెక్ట‌ర్‌లోనే చిరంజీవి న‌టిస్తున్నార‌ట‌. చాలా స్టైలిష్‌గా ఆయ‌న క్యారెక్ట‌ర్ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ప్రియ‌మ‌ణి...డింపుల్ హ‌య‌తి...

ఈ పాన్ ఇండియ‌న్ మూవీని శాండ‌ల్‌వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. చిరంజీవి సినిమాతోనే ఈ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రియ‌మ‌ణి, అన‌స్వ‌ర రాజ‌న్‌తో పాటు డింపుల్ హ‌య‌తి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్‌...

తొలుత ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అనుకున్నార‌ట‌. కానీ రెహ‌మాన్ భారీగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో అత‌డి స్థానంలో త‌మ‌న్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం.

కాకా...

ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లోనే ఈ సినిమా లాంఛ్ కావాల్సింది. కానీ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ లీక్ కావ‌డంతో ఆ ఎఫెక్ట్ మెగా 158పై ప‌డింది. ఓపెనింగ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. మే 1న గ్రాండ్‌గా చిరంజీవి, బాబీ సినిమా పూజా కార్య‌క్ర‌మ‌ల‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. అదే రోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ యాక్ష‌న్ మూవీకి కాకా అనే టైటిల్‌ను అనుకుంటున్నార‌ట‌. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Advertisement