Manjummel Boys | మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరంపై లైంగిక వేధింపుల కేను నమోదు అయ్యింది. తన అపార్ట్‌మెంట్‌లోనే అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళా ఎర్నాకుళం పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదుచేసింది.
Entertainment | Published On Mar 2, 2026, 3.08 pm IST
Manjummel Boys | మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరంపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. కేరళ కొచ్చిలోని ఎర్నాకుళం పోలీస్ స్టేషన్‌లో ఈ మలయాళ డైరెక్టర్‌పై ఓ మహిళ కేసు పెట్టింది. మంజుమ్మల్ బాయ్స్ మూవీతో దర్శకుడిగా ఫేమస్ అయ్యారు చిదంబరం. కేవలం ఇరవై కోట్ల బడ్జెట్‌తో సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ 240 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. మంజుమ్మల్ బాయ్స్‌తో దర్శకుడిగా మలయాళంలో చిదంబరం పేరు మారుమోగింది.
బాలీవుడ్ డెబ్యూ మూవీ...
దక్షిణాది నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి అతడికి అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ డెబ్యూ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం మలయాళంలో చర్చనీయాంశంగా మారింది. తన అపార్ట్‌మెంట్‌లోకి చిదంబరం అక్రమంగా ప్రవేశించడంలో, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 2022లో ఈ ఘటన జరిగినట్లు ఆమె తన కంప్లైంట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
రెండు సెక్షన్ల కింద...
ఆమె కంప్లైంట్‌ను స్వీకరించిన ఎర్నాకుళం సౌత్ పోలీసులు చిదంబరంపై మహిళా గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడినందుకు సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. ఈ లైంగిక ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని దర్శకుడికి నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చిదంబరంపై కేసు పెట్టిన మహిళ కూడా నటి అని సమాచారం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




