OTT Review | డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ రివ్యూ – మమ్ముట్టి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Ott Review | మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం మూవీ ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది.
Entertainment | Published On Dec 20, 2025, 8.48 am IST
మమ్ముట్టి
OTT Review | మలయాళంలో ప్రయోగాలకు పెట్టింది పేరు మమ్ముట్టి (Mammootty). ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 ఓటీటీలో తెలుగులోనూ రిలీజైంది. ఈ డిటెక్టివ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
డొమినిక్ ఇన్వేస్టిగేషన్...
సీఐ డొమినిక్ (మమ్ముట్టి) ఓ ప్రైవేట్ డిటెక్టివ్. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన డొమినిక్ ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా జాబ్ పొగొట్టుకుంటాడు. భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. చిన్న చిన్న కేసులను డీల్ చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. డొమినిక్ ఇంటి ఓనర్ మాధురికి ఓ హాస్పిటల్‌లో లేడీస్ పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిదో కనిపెట్టి వారికి ఇచ్చేస్తే నాలుగు నెలలు అద్దె కట్టాల్సిన పనిలేదని డొమినిక్‌తో అంటుంది మాధురి. ఆ డబ్బు కోసం తన అసిస్టెంట్ విక్కీతో కలిసి లేడీస్ పర్స్ ఎవరిదో ఎంక్వైరీ చేయడం మొదలుపెడతాడు డొమినిక్. అతడి ఇన్వేస్టిగేషన్ ఆ పర్స్ పూజ విజయరాఘవన్ అనే అమ్మాయిదనే నిజం తెలుస్తుంది. కానీ ఆమె కనిపించకుండా పోయి నాలుగు రోజులు అయ్యిందని, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని పూజ స్నేహితులు డొమినిక్‌కు చెబుతారు. పూజ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ కార్తిక్‌ను కలవడానికి వెళ్లి మిస్సయ్యిందనే నిజం బయటపడుతుంది. కష్టపడి కార్తీక్ అడ్రస్ కనిపెడతాడు డొమినిక్. కానీ కారీక్త్ కూడా అదృశ్యమై రెండేళ్లు అవుతుందని అతడి చెల్లెలు నందిత చెబుతుంది. ఈ మిస్సింగ్‌ల వెనకున్న మిస్టరీని డొమినిక్ ఎలా ఛేదించాడు? కార్తీక్ చెల్లెలు నందిత గురించి డొమినిక్‌కు తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? పూజ ఎలా చనిపోయింది? ఈ కేసును డొమినిక్ ఏ విధంగా సాల్వ్ చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
క్లైమాక్స్‌లో...
డిటెక్టివ్ సినిమాలు చాలా వరకు ఒకే టెంప్లేట్ స్టోరీతో సాగుతుంటాయి. ఎలాంటి ఆధారాలు లేని ఓ కేసును హీరో సాల్వ్ చేసుకుంటూ వెళ్లడం...తన తెలివితేటలతో కష్టపడి క్లైమాక్స్‌లో విలన్‌ను పట్టుకోవడం అనే అంశాల చుట్టే ఈ కథలు తిరుగుతుంటాయి. డొమినిక్ కూడా అలాంటి కథే. మమ్ముట్టి లాంటి స్టార్ ...హీరోగా నటించడం, ప్రేమ కథలు, యాక్షన్ సినిమాలతో ఫేమస్ అయిన గౌతమ్ మీనన్ ఫస్ట్ టైమ్ మలయాళంలో సినిమా చేయడం.. అదికూడా డిటెక్టివ్ కథతో ఎంట్రీ ఇవ్వడంతో డొమినిక్‌పై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్లుగా సినిమా లేదు.
డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడు రేసీ స్క్రీన్‌ప్లే, ఊహలకు అందని ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగాలి. అలాంటి మెరుపులు, మ్యాజిక్‌లు ఈ సినిమాలో కనిపించవు. డ్రామా సినిమాలా కథను సాగదీస్తూ వెళ్లిపోయాడు డైరెక్టర్. దాంతో థ్రిల్లింగ్ ప్లేస్‌లో బోర్ ఫీలింగ్‌నే ఎక్కువగా కలిగిస్తుంది ఈ మూవీ.
షెర్లాక్ హోమ్స్ రేంజ్‌లో...
డొమినిక్ క్యారెక్టర్ గురించి చెప్పడానికే అరగంటకుపైగా టైమ్ తీసుకున్నాడు. హాస్పిటల్‌తో దొరికిన లేడీస్ పర్స్ గురించి డొమినిక్ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి అయినా సినిమా ఫాస్ట్ ఫేజ్‌లో సాగిందా అంటే అదీ లేదు. హీరో ఓ షెర్లాక్‌హోమ్స్ అన్న లెవెల్‌లో బిల్డప్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. కానీ డిటెక్టివ్‌గా అతడు కేసును డీల్ చేసే విధానం మాత్రం సీఐడీ సీరియల్‌ను పోలి ఉంటుంది. అనుమానితులను కనిపెట్టే సీన్స్ సిల్లీగా ఉంటాయి.
డొమినిక్ సినిమా మొత్తానికి క్లైమాక్స్ ఒక్కటే హైలైట్‌గా నిలిచింది. అసలు విలన్ ఎవరన్నది రివీలయ్యే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అలాంటి బలమైన సీన్స్ ఇంకొన్ని పడుంటే బాగుండేది.
మమ్ముట్టి కామెడీ టైమింగ్...
మమ్ముట్టికి ఉన్న యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు డొమినిక్ లాంటి క్యారెక్టర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఎలాంటి ఛాలెంజెస్ లేని పాత్ర కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయారు. సీరియస్ సిట్యూవేషన్స్‌లో అతడు వేసే పంచ్‌లు నవ్విస్తాయి. నందిత పాత్రలో సుస్మితా భట్ నటన బాగుంది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో మెప్పించింది. డొమినిక్ అసిస్టెంట్ పాత్రలో గోకుల్ సురేష్ యాక్టింగ్ పర్వాలేదనిపిస్తుంది. టెక్నికల్‌గా సినిమా ఏమంత గొప్పగా లేదు. పాటలు సినిమా నిడివి పెంచడానికే ఉపయోగపడ్డాయి.
డొమినిక్ బోరింగ్ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ. మమ్ముట్టి యాక్టింగ్ కోసమే ఓ సారి ఈ సినిమా చూడొచ్చు.
సంబంధిత వార్తలు

Web Series | సలార్ రాజు మిస్సింగ్ – మెగా బ్రదర్ రీఎంట్రీ .. కామెడీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?
మే 14, 2026

Jananayagan OTT | జననాయగన్ ఓటీటీ డీల్…. అప్పుడు 120 కోట్లు – ఇప్పుడు 50 కోట్లు – లీక్ ఎఫెక్ట్
మే 2, 2026

Kerala Story 2 OTT | ఓటీటీలోకి వివాదాస్పద మూవీ కేరళ స్టోరీ 2 – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?
ఏప్రిల్ 24, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



