OTT | 5 కోట్ల బడ్జెట్ – యాభై కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ
మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ ఎకో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. డిసెంబర్ 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి దింజిత్ అయ్యథాన్ దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Dec 26, 2025, 5.30 pm IST
ఎకో మూవీ
OTT | మలయాళంలో ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది ఎకో. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎకో మూవీలో పేరున్న స్టార్లు ఎవరూ లేరు. బడ్జెట్ తక్కువే. చాలా వరకు సింగిల్ లోకేషన్‌లోనే సాగుతుంది. అయినా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మలయాళ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
తాజాగా ఈ మలయాళ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఎకో డిసెంబర్ 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఎకో సినిమాలో సందీప్ ప్రదీప్, వినీత్, సౌరభ్ సచ్‌దేవ్, నరేన్ కీలక పాత్రల్లో నటించారు. మలేషియన్ యాక్టర్స్ బియానా మోమిన్, సిమ్‌జీ కూడా కనిపించారు. దింజిత్ అయ్యథాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బాహుల్ రమేష్ కథను అందించారు.
హయ్యెస్ట్ కలెక్షన్స్...
ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఎకో మూవీ థియేటర్లలో యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కిష్కిందకాండం సినిమాతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ 2 వెబ్‌సిరీస్ తర్వాత యానిమల్ ట్రయాలజీలో భాగంగా దింజిత్ అయ్యథాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ వీక్‌లో చాలా తక్కువ థియేటర్లలో ఎకో మూవీ రిలీజైంది. మౌత్ టాక్ బాగుండటంతో థియేటర్లు మెళ్లమెళ్లగా పెరిగాయి.
ఎకో కథ ఇదే...
కురియచన్ ఓ క్రిమినల్. అతడి కోసం చాలా ఏళ్లుగా పోలీసులతో పాటు కొంతమంది రౌడీలు వెతుకుతుంటారు. కేరళ కర్ణాటక బార్డర్‌లోని ఓ కొండ ప్రాంతంలో కురియచన్ భార్య మాలతి ఒంటరిగా ఉంటుంది. కురియచన్‌ను వెతుక్కుంటూ ఆ కొండ ప్రాంతానికి వచ్చిన వారందరిని ఆ ప్రాంతంలోని అడివి కుక్కలు చంపేస్తుంటాయి. మాలతికి కేర్ టేకర్‌గా పనిచేసే పీయోస్ ఎవరు? అసలు కురియచన్ ఎలా మిస్సయ్యాడు? ఈ మిస్టరీ ఎలా సాల్వ్ అయ్యింది అనే అంశాలతో ఎకో మూవీ రూపొందింది.
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026

OTT | ఓటీటీలోకి రెండు వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – నాలుగు గంటల రన్టైమ్తో రిలీజ్
మే 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



