త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి మ‌ల‌యాళం అవార్డ్ విన్నింగ్ మూవీ – బైక్ సైలెన్స‌ర్ చుట్టూ తిరిగే క‌థ – ఐదేళ్ల త‌ర్వాత రిలీజ్‌

మ‌ల‌యాళం అవార్డ్ విన్నింగ్ మూవీ సైలెన్స‌ర్ ఓటీటీలో రిలీజైంది. శ‌నివారం నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లాల్ లీడ్‌లో రోల్‌లో న‌టించిన ఈ మూవీకి ప్రియానంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

N

Entertainment | Published On Jan 10, 2026, 7.23 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి మ‌ల‌యాళం అవార్డ్ విన్నింగ్ మూవీ – బైక్ సైలెన్స‌ర్ చుట్టూ తిరిగే క‌థ – ఐదేళ్ల త‌ర్వాత రిలీజ్‌
Advertisement

Malayalam OTT  మ‌ల‌యాళం అవార్డ్ విన్నింగ్ మూవీ సైలెన్స‌ర్ ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2020లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా దాదాపు ఐదేళ్ల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్రియానంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టుడు లాల్ హీరోగా న‌టించాడు. మీరావాసుదేవ‌న్‌, ఇర్షాద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మ‌ల‌యాళం మూవీ ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. అనేక అవార్డుల‌ను అందుకుంది.

తండ్రీకొడుకుల గొడ‌వ‌...

ఈనాశు (లాల్‌) పాత‌కాల‌పు మ‌నిషి. రాజ్‌దూత్ బైక్‌ను ప్రాణంగా చూసుకుంటాడు. కొడుకు స‌న్నీకి తండ్రి సిద్ధాంతాల‌ను వ్య‌తిరేకిస్తుంటాడు. తండ్రి బైక్ సెలైన్స‌ర్ నుంచి వ‌చ్చే సౌండ్ అంటే స‌న్నీకి అస్స‌లు ఇష్టం ఉండ‌దు. తండ్రికి దూరంగా వెళ్లిపోతాడు. ఒంట‌రిత‌నం కార‌ణంగా ఈనాశు ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.
మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ వైశాఖ‌న్ ఈ మూవీ క‌థ‌ను అందించారు. కేర‌ళ‌లోని త్రిసూర్ ప్రాంత సంస్కృతి, యాస‌, భాష‌ల‌ను ఆవిష్క‌రిస్తూ ఈ మూవీ రూపొందింది. సైలెన్స‌ర్ మూవీ త్వ‌ర‌లో ఓటీటీలో తెలుగులో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
మ‌ల‌యాళంలో సీనియ‌ర్ యాక్ట‌ర్ అయిన బాలు...తెలుగులో చాలానే సినిమాలు చేశారు. ఓజీ, ది వారియ‌ర్‌, సాహో, వీర‌సింహారెడ్డి సినిమాల్లో న‌టించాడు. పులిజ‌న్మ‌మ్ మూవీతో డైరెక్ట‌ర్ ప్రియానంద‌న్ బెస్ట్ డైరెక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డును అందుకున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement