త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Megastar | మెగాస్టార్ పొలిటిక‌ల్ మూవీ – పాద‌యాత్ర ప్రీ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

మ‌ల‌యాళ హీరో మ‌మ్ముట్టి పాద‌యాత్ర పేరుతో ఓ సినిమా చేయ‌బోతున్నారు. శుక్ర‌వారం ఈ మూవీని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన మ‌మ్ముట్టి ప్రీ లుక్ రిలీజ్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ జీవితంలోని కీల‌క ఘ‌ట్టాల‌తో గ‌తంలో మ‌మ్ముట్టి చేసిన తెలుగు మూవీ యాత్ర‌కు ఈ మ‌ల‌యాళం మూవీతో సంబంధం ఉండ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Jan 23, 2026, 3.59 pm IST

Megastar | మెగాస్టార్ పొలిటిక‌ల్ మూవీ – పాద‌యాత్ర ప్రీ లుక్ పోస్ట‌ర్ రిలీజ్
Advertisement

Mammootty | మ‌ల‌యాళం మెగాస్టార్ మ‌మ్ముట్టి త‌న కొత్త మూవీని శుక్ర‌వారం అనౌన్స్‌చేశారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. మ‌ల‌యాళ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు పాద‌యాత్ర అనే టైటిల్ క‌న్ఫామ్ అయ్యింది. ఈ మూవీ ప్రీ లుక్ పోస్ట‌ర్ లో ఓ వ్యక్తి న‌డుచుకుంటూ వెళుతుండ‌గా అత‌డి అడుగుల గుర్తులు క‌నిపిస్తున్నాయి. జ‌ర్నీ బిగిన్స్ అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. పాద‌యాత్ర మూవీని మ‌మ్ముట్వి స్వ‌యంగా ప్రొడ్యూస్ చేయ‌బోతున్నారు.

32 ఏళ్ల త‌ర్వాత‌...

దాదాపు 32 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌మ్ముట్టి, డైరెక్ట‌ర్ ఆదూర్ గోపాల్‌కృష్ణ క‌లిసి సినిమా చేయ‌బోతుండ‌టం మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. గతంలో మ‌మ్ముట్టి, ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్ కాంబినేష‌న్‌లో అనంత‌రం, మ‌థిలుక‌ల్‌, విధేయ‌న్ సినిమాలు వ‌చ్చాయి. మ‌థిలుక‌ల్‌, విధేయ‌న్ సినిమాల‌కుగాను మ‌మ్ముట్టి బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డులు అందుకున్నారు. ప‌లు విభాగాల్లో ఈ మూడు సినిమాలు జాతీయ అవార్డుల‌ను ద‌క్కించుకున్నాయి.

యాత్ర‌కు సంబంధం ఉందా?

మ‌మ్ముట్టి తెలుగులో యాత్ర పేరుతో సినిమా చేశారు. 2003లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన‌ పాద‌యాత్ర ఆధారంగా ఈ మూవీ రూపొందింది. యాత్ర‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కిన యాత్ర 2లో మ‌మ్ముట్టి గెస్ట్ రోల్ చేశారు. తాజాగా మ‌మ్ముట్టి కొత్త సినిమాకు పాద‌యాత్ర అనే టైటిల్ పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. యాత్ర, యాత్ర 2 సినిమాల‌తో ఈ మ‌ల‌యాళం మూవీకి సంబంధం ఉండొచ్చ‌ని ప‌లువురు నెటిజ‌న్లు పోస్ట్‌లు పెడుతున్నారు. పొలిటిక‌ల్ అంశాల‌తోనే పాద‌యాత్ర‌ రూపొంద‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
పాద‌యాత్ర మూవీలో ఇంద్రాన్స్‌, గ్రేజ్ ఆంటోనీ, శ్రీష్మ చంద్ర‌న్‌, జీన‌త్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన కాలంకావ‌ల్ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా నెగెటివ్ రోల్‌లో మ‌మ్ముట్టి అద‌ర‌గొట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement