Mehar Ramesh | డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ – వేడుకకు హాజరైన కేటీఆర్, చిరంజీవి
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. మెహర్ రమేష్ కూతురు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తోట చంద్రశేఖర్ కుమారుడితో మెహర్ రమేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
Entertainment | Published On Apr 26, 2026, 5.12 pm IST
Mehar Ramesh | టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెహర్ రమేష్ కుమార్తె మోహన పెళ్లి పీటలు ఎక్కబోతుంది. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కుమారుడు ఆదిత్య శేఖర్‌తో మోహన త్వరలో ఏడడుగులు వేయబోతుంది. ఈ జంట వివాహ నిశ్చితార్థ వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
ఈ నిశ్చితార్థ వేడుకలో మాజీ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
చిరంజీవి మేనల్లుడిగా ...
చిరంజీవి మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మెహర్ రమేష్. తెలుగులో కంత్రి, బిల్లా, శక్తి, షాడో సినిమాలకు దర్శకత్వం వహించాడు. చివరగా చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్‌తో డైరెక్టర్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించారు మెహర్ రమేష్. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా దర్శకుడిగా మాత్రం విజయాలను అందుకోలేకపోయారు.
బీఆర్ఎస్ ఏపీ అధ్యకుడిగా ...
మరోవైపు తోట చంద్రశేఖర్‌కు కూడా మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఐఎస్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చంద్రశేఖర్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. గుంటూరు లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి ఏలూరు ఎంపీగా, 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఏపీ అధ్యకుడిగా కొనసాగుతోన్నారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



