Malayalam OTT | ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజైన మూడు మలయాళ సినిమాలు
మూడు మలయాళం సినిమాలు ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజయ్యాయి. ఒక్కోటి ఒక్కో జానర్‌లో తెరకెక్కిన ఆ సినిమాలు ఏవంటే?
Entertainment | Published On Apr 20, 2026, 5.03 pm IST
Malayalam OTT | డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో రూపొందిన మూడు మలయాళం సినిమాలు ఒకే రోజు.. ఒకే ఓటీటీలో రిలీజయ్యాయి. సూపర్ జిమ్నీతో పాటు నాల్పత్తుకలితే ప్రణయం, తల సినిమాలు సోమవారం ఓటీటీలోకి వచ్చాయి. మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
సూపర్ జిమ్నీ...
లేడీ ఓరియెంటెడ్ కామెడీ డ్రామాగా రూపొందిన జూపర్ జిమ్నీ సినిమాకు అను పురుషోత్ దర్శకత్వం వహించాడు. మీనాక్షి అనూప్ లీడ్ రోల్‌లో నటించింది. ఈ ఏడాది జనవరిలో రిలీజైన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. డ్రగ్ మాఫియాతో పాటు అవినీతిపై వీనా అనే యువతి ఎలాంటి పోరాటం సాగించిందనే పాయింట్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.
నాల్పత్తుకలితే ప్రయణం...
ఓ రైటర్‌కు , పబ్లిషర్‌కు మధ్య సాగే ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో జెర్నీ జాన్, ఆశా వీ నాయర్ హీరోహీరోయిన్లుగా నటించారు. రమేష్ మాణిక్యం డైరెక్టర్. ఓ రచయిత భార్యకు విడాకులు ఇస్తాడు. అతడు రాసిన ఓ బుక్‌ను ఓ మహిళ పబ్లిష్ చేస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఎలా ప్రేమకు దారితీసిందన్నదే ఈ సినిమా కథ.
తల మూవీ
మలయాళం థ్రిల్లర్ మూవీ తల కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను దక్కించుకుంది. ఈ థ్రిల్లర్ సినిమాలో సురభి లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ఖాయిస్ మిలేన్ దర్శకత్వం వహించాడు. ఓ స్లమ్ ఏరియాలో మనిషి తల దొరుకుతుంది? అది ఎవరిది? తల వెనుకున్న మిస్టరీ ఎలా రివీలైంది అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mohan Lal | ఓటీటీలో పెద్ద హిట్ – థియేటర్లలో ఎపిక్ డిజాస్టర్ – మోహన్‌లాల్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్
ఏప్రిల్ 14, 2026

Drishyam 3 | మోహన్‌లాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ …. దృశ్యం 3 పోస్ట్‌పోన్
మార్చి 23, 2026

Malayalam OTT | ఓటీటీలోకి వచ్చిన వెరైటీ టైటిల్ మలయాళం మూవీ – సినిమా డైరెక్టర్‌కు దేవుడు ప్రత్యక్షమైతే…?
మార్చి 22, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



