Malayalam Heroine | చిరంజీవి సినిమా నుంచి మలయాళ బ్యూటీ ఔట్ – ఒప్పుకొని… తప్పుకోవడంపై అనుమానాలు?
చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ మూవీలో మలయాళ బ్యూటీ హనీ రోజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరిగింది. చిరంజీవి సినిమాలో నటించడానికి అంగీకరించిన హనీరోజ్ డేట్స్ క్లాష్ కారణంగా సెట్స్‌లో అడుగుపెట్టకముందే మెగా 158 నుంచి వైదొలిగిందట.
Entertainment | Published On Jun 4, 2026, 3.58 pm IST
Malayalam Heroine | చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 158వ మూవీ షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో శరవేగంగా సాగుతోంది. చిరంజీవి, అనస్వర రాజన్‌తో పాటు ప్రధాన తారాగణంపై డైరెక్టర్ బాబీ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మలయాళ బ్యూటీ
ఈ పాన్ ఇండియన్ మూవీలో మలయాళ బ్యూటీ హనీ రోజ్ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్లామర్‌కు స్కోప్ ఉన్న ఓ నెగెటివ్ క్యారెక్టర్‌లో హనీ రోజ్ నటించనుందంటూ వార్తలు వినిపించాయి. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కావడంతో కథ విన్న వెంటనే ఈ మలయాళ బోల్డ్ బ్యూటీ సినిమాకు ఓకే చెప్పిందట. అడ్వాన్స్ కూడా తీసుకుందట. షూటింగ్‌లో అడుగుపెట్టడమే తరువాయి అనుకుంటోన్న టైమ్‌లోనే ఈ మలయాళ హీరోయిన్ మేకర్స్‌కు పెద్ద షాకిచ్చినట్లు సమాచారం. సెట్స్‌లో అడుగుపెట్టకుండానే డేట్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకుందట.
ఓ మలయాళ సినిమాతో మెగా 158 డేట్స్ క్లాష్ కావడంతో మరోదారి లేక ఈ సినిమా చేయనని చెప్పేసిందట. అంతే కాకుండా తాను తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇచ్చేసిందట.
ఒక్క సినిమా లేదు...
చిరంజీవి సినిమా నుంచి హనీ రోజ్ వైదొలగడానికి డేట్స్ క్లాష్ కారణం కాదని అంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అలాంటప్పుడు డేట్స్ క్లాష్ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతోన్నారు. మెగా స్టార్ సినిమాలో నటించకూడదంటూ ఈ మలయాళ బ్యూటీపై ఓ సీనియర్ ఒత్తిడి తీసుకొచ్చాడని, అతడి వల్లే హనీ రోజ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు చెబుతున్నారు. ఆ హీరో ఎవరన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
మలయాళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా యాభైకిపైనే సినిమాలు చేసింది హనీరోజ్. బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఓ హీరోయిన్‌గా నటించింది.
సంబంధిత వార్తలు

Anupama Parameswaran | యాక్టింగ్‌కు పనికిరానని రిజెక్ట్ చేశారు – కన్నీళ్లు ఆగలేదు – అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
జూన్ 4, 2026

Chiranjeevi | తండ్రిగా గర్వపడుతున్నా – రామ్‌చరణ్ పెద్దిపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ
జూన్ 4, 2026

Buchi Babu Sana | పెద్ది ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదు…చిరంజీవి తిడతారనుకున్నా – పెద్దిపై బుచ్చిబాబు సానా కామెంట్స్
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●Rajesh Exports Scam | హర్షద్ మెహతా కంటే పెద్ద స్కామ్: రూ. 15 లక్షల కోట్ల బోగస్ లెక్కలతో దొరికిపోయిన 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్'
- ●Karne Prabhakar | ఉద్యమకారుల కమిటీ ఉంటే ఏంది.. లేకుంటే ఏంది?
- ●Ponguleti Srinivas Reddy | పెంచుతున్నది భూముల విలువ మాత్రమే.. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ కాదు: మంత్రి పొంగులేటి
- ●motorola edge 70 Pro Plus | రూ.47,999కే మోటోరోలా సంచలనం.. 6500ఎంఏహెచ్ బ్యాటరీతో ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ఫోన్ లాంచ్..
- ●Malayalam OTT | ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ కామెడీ మూవీ
- ●Hairsh Rao | మోసమే కాంగ్రెస్ పార్టీ నైజం: హరీశ్ రావు

Rajesh Exports Scam | హర్షద్ మెహతా కంటే పెద్ద స్కామ్: రూ. 15 లక్షల కోట్ల బోగస్ లెక్కలతో దొరికిపోయిన 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్'

Karne Prabhakar | ఉద్యమకారుల కమిటీ ఉంటే ఏంది.. లేకుంటే ఏంది?

Ponguleti Srinivas Reddy | పెంచుతున్నది భూముల విలువ మాత్రమే.. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ కాదు: మంత్రి పొంగులేటి

motorola edge 70 Pro Plus | రూ.47,999కే మోటోరోలా సంచలనం.. 6500ఎంఏహెచ్ బ్యాటరీతో ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ఫోన్ లాంచ్..



