త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malavika Mohanan | ఒత్తిడితో దిగులుగా అనిపించేది..! మనసులో మాట బయటపెట్టిన మాళవిక మోహనన్

Malavika Mohanan | సౌత్‌ బ్యూటీ మాళవిక మోహనన్‌ ఇటీవల నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనితింగ్’ సెషన్‌లో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంది. చెన్నైలో షూటింగ్ కారణంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడంతో ఒంటరితనం, ఒత్తిడి అనిపించిందని తెలిపింది. అదే సమయంలో విజయ్‌ సేతుపతి నటిస్తున్న తన కొత్త తమిళ చిత్రం ‘పాకెట్ నావెల్’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

P

Entertainment | Published On Apr 24, 2026, 2.30 pm IST

Malavika Mohanan | ఒత్తిడితో దిగులుగా అనిపించేది..! మనసులో మాట బయటపెట్టిన మాళవిక మోహనన్
Advertisement

Malavika Mohanan | సౌత్‌ బ్యూటీ మాళవిక మోహనన్‌ ఇటీవల తన వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో షేర్‌ చేసుకుంది. సోషల్‌ మీడియాలో ‘ఆస్క్ మీ ఎనితింగ్’ సెషన్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా చివరిసారిగా ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకుందో.. అందుకు కారణాలు ఏంటో వెల్లడించింది. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘గత నెలలో పనిమీద చెన్నైలో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. నా టీమ్‌ ఎంతో సపోర్టివ్‌ అయినా ఇంటికి, కుటుంబీకులు, సన్నహితులకు ఎక్కువ రోజులు ఉండడం ఒంటరితనాన్ని కలిగించింది. రోజువారీ పనులయ్యాక హోటల్‌ రూమ్‌కు వెళ్లినప్పుడు మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడం కాస్త కఠినంగా అనిపించింది.

ఏడ్చేసే పరిస్థితి కాకపోయినా కొంతకాలం ఒత్తిడి పెరిగి మానసికంగా దిగులుగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టుల గురించి సైతం మాళవిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. విజయ్‌ సేతుపతి‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్నారని పేర్కొంది. ‘మన తరం దర్శకుల్లో ఆయన అత్యుత్తముల్లో ఒకరు. షూటింగ్‌ చాలా బాగా జరుగుతోంది. కథను తెరపైకి తీసుకురావడంలో మొత్తం టీమ్‌ ఎంతో కృషి చేస్తోంది. ‘పాకెట్ నావెల్’ టైటిల్‌తో వస్తున్న మూవీ ఈ ఏడాది విడుదలవుతుంది. ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను’ అని చెప్పింది. ఇదిలా ఉండగా మాళవిక మోహనన్ మరో చిత్రం ‘సర్దార్ 2’లో కార్తీ సరసన నటిస్తోంది.

సీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయింది. షూటింగ్ ముగిసిన సందర్భంగా మాళవిక మాట్లాడుతూ ‘ఈ చిత్రం నాకు ఒక ప్రత్యేక అనుభవం. ప్రారంభంలోనే కఠినమైన షెడ్యూల్‌తో మొదలై, బ్యాంకాక్‌లో సరదాగా ముగిసింది. ఇది మరచిపోలేని ప్రయాణం’ అని పేర్కొంది. కార్తీ, దర్శకుడు మిత్రన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ‘కార్తీతో పని చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. మాకు అనేక విషయాల్లో సిమిలారిటీలు ఉన్నాయని తెలిసింది. తనను ఈ చిత్రంలో భాగం చేసినందుకు మిత్రన్‌ గారికి కృతజ్ఞతలు. ఇది నా కెరీర్‌లో భిన్నమైన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చింది.

Read Also :

Adah Sharma | ఇండియా దివాళా తీస్తే … కేర‌ళ స్టోరీ నిర్మాత కొత్త సినిమా …అదా శ‌ర్మ హీరోయిన్‌

Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీ షూటింగ్ క‌ష్టాలు – ఈ ఏడాది రిలీజ్ కావ‌డం అనుమానమే?

Advertisement
Advertisement