Adah Sharma | ఇండియా దివాళా తీస్తే … కేరళ స్టోరీ నిర్మాత కొత్త సినిమా …అదా శర్మ హీరోయిన్
కేరళ స్టోరీ బ్లాక్‌బస్టర్ తర్వాత నిర్మాత విపుల్ అమృత్ లాల్ షాతో కలిసి హీరోయిన్ అదా శర్మ మరో సినిమా చేయబోతున్నది. ఈ మూవీకి గవర్నర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు.
Entertainment | Published On Apr 23, 2026, 6.01 pm IST
Adah Sharma |కేరళ స్టోరీ, కేరళ స్టోరీ 2 సక్సెస్‌ల తర్వాత నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా తన తదుపరి సినిమాను గురువారం అనౌన్స్‌చేశారు. ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్‌తో పాటు హీరోహీరోయిన్లు ఎవరన్నది కూడా రివీల్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి గవర్నర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ది సెలైంట్ సేవియర్ అంటూ టైటిల్‌కు ఓ క్యాప్షన్ జోడించారు.
గవర్నర్ మూవీలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తోండగా...అదా శర్మ కథానాయికగా కనిపించబోతున్నది.
ఆర్‌బీఐ సింబల్...
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని ఫైల్స్ ఉన్న టేబుల్, దాని వెనుక ఓ గ్రీన్ కలర్ కుర్చీ కనిపిస్తోంది. గోడపై ఆర్‌బీఐ సింబల్ ఉండటం ఆసక్తిని పంచుతోంది. భారతదేశం దివాలా అంచున ఉంది...ఇది కుర్చీ కాదు ఓ బాధ్యత అంటూ పోస్టర్‌పై ఉన్న అక్షరాలు ఆసక్తిని పంచుతోన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన మరో పోస్టర్‌లో ఓ లెదర్ సూట్‌కేస్ పట్టుకొని మనోజ్ బాజ్‌పాయ్ నడుచుకుంటూ వెళుతున్నారు. నేను విఫలమైతే భారత దేశం మొత్తం ఫెయిలవుతుంది అంటూ అక్షరాలు కనిపిస్తోన్నాయి.
అజ్ఞాతవీరుడు...
భారత దేశం ప్రపంచ శక్తిగా ఎదగడానికి కారణమైన ఓ అజ్ఞాతవీరుడి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఓ బయోపిక్ అని ప్రచారం జరుగుతోంది. కానీ ఎవరి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు.
కేరళ స్టోరీ తర్వాత...
పోస్టర్లు చూస్తుంటే ఇందులో మనోజ్ బాజ్‌పాయ్, అదా శర్మ పాత్రలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. జూన్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
విపుల్ అమృత్‌లాల్ షా బ్యానర్‌లో ఆదా శర్మ చేస్తోన్న సెకండ్ మూవీ ఇది. కేరళ స్టోరీలో ఆదా శర్మ మెయిన్ లీడ్‌గా కనిపించింది. ప్రస్తుతం హాటక్, సూపర్ వెల్లి సినిమాలు చేస్తోంది అదా శర్మ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Adah Sharma | పదకొండేళ్ల తర్వాత కన్నడ సినిమాలో అదాశర్మ – బిగ్‌బాస్ విన్నర్‌తో మైథాలజీ మూవీ
సెప్టెంబర్ 21, 2026

Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ – లంగా ఓణీలో కృతిశెట్టి – జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్
సెప్టెంబర్ 21, 2026

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు



