Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ లిస్ట్‌లో సందీప్ వంగాతో పాటు పలువురు అగ్ర దర్శకులు ఉన్నారు. వారందరిని కాదని అనిల్ రావిపూడికి మహేష్‌బాబు ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.
Entertainment | Published On Aug 25, 2026, 3.49 pm IST
Mahesh Babu | ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో వారణాసి సినిమా చేస్తోన్నాడు మహేష్‌బాబు. ట్రైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం గత మూడేళ్లుగాతెగ కష్టపడుతోన్నాడు. ఇందులో రుద్ర అనే ఆర్కియాలజిస్ట్‌గా, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో మహేష్‌బాబు కనిపించబోతున్నారు. ఈ పాత్రల కోసం ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యారు. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఫారిన్‌లో స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకున్నారు. రాజమౌళిపై నమ్మకంతో సినిమా కోసం ఏం చేయాలో అన్ని చేస్తున్నాడు. పదిహేను వందల కోట్లతో మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా వారణాసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సందీప్ రెడ్డి వంగా....
అక్టోబర్ నెలాఖరులోగా వారణాసి షూటింగ్‌కు మహేష్‌బాబు ప్యాకప్ చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాన్ వరల్డ్ మూవీ తర్వాత సూపర్ స్టార్ నెక్స్ట్ మూవీ ఏదన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మహేష్‌బాబుతో సినిమా చేసేందుకు పలువురు అగ్ర దర్శకులు రెడీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగాతో ఈ టాలీవుడ్ స్టార్ హీరో మూవీ కన్ఫామ్ అయినట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగుతుతోంది. మహేష్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ల జాబితాలో సందీప్ వంగాతో పాటు శివనిర్వాణ, అరుణ్ మాథేశ్వరన్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
2028 సంక్రాంతి....
కానీ వారందరిని కాదని డైరెక్టర్ అనిల్ రావిపూడికి మహేష్‌బాబు ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. రాజమౌళి సినిమా కోసం మూడేళ్లు కేటాయించిన మహేష్‌బాబు...తదుపరి సినిమాకు మాత్రం అంత గ్యాప్ తీసుకోకూడదని అనుకుంటున్నట్లు సమాచారం. ఏడాదిలోపే నెక్స్ట్ మూవీని పూర్తిచేయాలని ఫిక్సైనట్లు తెలిసింది. అందుకే అనిల్ రావిపూడితో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతోన్నారు. అనిల్ రావిపూడి గత సినిమాల శైలిలోనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీని 2028 సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో మహేష్‌బాబు, అనిల్ రావిపూడి మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. గతంలో మహేష్‌బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో జనవరి 12 విడుదల పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. 2027 జనవరి 13న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ – అధ్యక్ష పదవికి పోటీ
ఆగస్టు 25, 2026

Anupama Parameswaran | తెలుగు టీవీ షోకు జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ – జానీ మాస్టర్‌తో కలిసి!
ఆగస్టు 24, 2026

Tollywood | ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో – న్యూజిలాండ్‌లో వివాహ వేడుకలు
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
- ●Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ

NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!

Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?

Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ



