Graduates’ MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
Graduate MLC Elections | ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. రాకేశ్‌రెడ్డి, గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు మధ్య త్రిముఖ పోరు ఖాయమేనన్న చర్చలు ఊపందుకున్నాయి.
- కాంగ్రెస్ నుంచి పీవీ శ్రీనివాస్‌రావు పోటీ!
- బీజేపీ పోటీలో నిలుస్తుందా? మద్దతిస్తుందా?
- కమల దళం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
- రాజకీయ వర్గాల్లో వాడీవేడీగా చర్చ
- 2027, మార్చిలో ఎన్నికలు
త్రినేత్ర.న్యూస్: ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి పేరు వినిపిస్తుండగా, జనసేన పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా ప్రజారోగ్య మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్‌రావును బరిలో నిలిచే అవకాశాలున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే రాకేశ్‌రెడ్డి, గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు మధ్య త్రిముఖ పోరు ఖాయమేనన్న చర్చలు ఊపందుకున్నాయి.
జర్నలిస్టుగా అపార అనుభవం ఉన్న పీవీ శ్రీనివాస్ రావు ప్రస్తుతం తెలంగాణ ఆర్టీఐ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2025, మే 12న ఆయన్ను రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో మూడు సంవత్సరాల పాటు ఆయన కాలపరిమితి కలిగి ఉన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ కేసులను వేగంగా పరిష్కరించడంలో, పారదర్శక పాలనను ప్రోత్సహించడంలో ఆయన మంచి పేరు తెచ్చుకోవడంతో కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ఆయన్ను పోటీలో దింపేందుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం ఇదే తొలిసారి కాగా సెప్టెంబర్ 13న ఖమ్మంలో ‘జనసేన-శంఖారావం’ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక బీజేపీ నుంచి ఎవరైనా పోటీ చేస్తారా? లేదా జనసేన అభ్యర్థికి మద్దతునిస్తారా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై బీజేపీ ఎలా స్పందిస్తుందనే దానిపై రాజకీయ నాయకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. 2027, మార్చిలో జరగబోయే ఈ ఎన్నికలపై బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే ఇక.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
ఆగస్టు 25, 2026

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
ఆగస్టు 25, 2026

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?

NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!

Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?

Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ



