త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Caste Census | కుల‌గ‌ణ‌నలో ఓపెన్ ఎండెడ్ విధానం వ‌ద్దు.. ప్ర‌ధానికి రాహుల్‌, ఖ‌ర్గే లేఖ‌

Caste Census | జనగణనలో కులాల నమోదుకు ‘ఓపెన్-ఎండెడ్’ విధానాన్ని అమలు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi )కి కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge), ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. సమర్థవంతమైన సామాజిక న్యాయ విధానాలను రూపొందించడానికి, వివిధ వర్గాల సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి విశ్వసనీయమైన కుల గణాంకాలు అవసరమని పేర్కొన్నారు.

D

National | Published On Aug 25, 2026, 3.13 pm IST

Caste Census | కుల‌గ‌ణ‌నలో ఓపెన్ ఎండెడ్ విధానం వ‌ద్దు.. ప్ర‌ధానికి రాహుల్‌, ఖ‌ర్గే లేఖ‌
Advertisement

Caste Census | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలో ఈసారి జనగణనలో కుల వివరాలను కూడా సేక‌రించ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ విధానం కోసం కేంద్రం ప్ర‌తిపాదించిన ప‌ద్ధ‌తిపై కాంగ్రెస్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. జనగణనలో కులాల నమోదుకు ‘ఓపెన్-ఎండెడ్’ విధానాన్ని అమలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi )కి కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge), ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. సమర్థవంతమైన సామాజిక న్యాయ విధానాలను రూపొందించడానికి, వివిధ వర్గాల సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి విశ్వసనీయమైన కుల గణాంకాలు అవసరమని పేర్కొన్నారు.

ఓపెన్-ఎండెడ్ (Open-ended) ప్రశ్నల విధానం తప్పుదోవ పట్టించేలా ఉందని, దీనిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒకే కులానికి వేర్వేరు పేర్లు, ఉప కులాలు, భాషాపరమైన భేదాలతో కూడిన పేర్లు ఉన్నాయని వివరించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒకే కులానికి చెందిన వ్య‌క్తులు వేర్వేరు పేర్ల‌తో న‌మోదైతే ఒక కులం అనేక వేర్వేరు కులాలుగా విడిపోయే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనివల్ల లెక్కింపు డేటా పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని తెలిపారు.

అదేవిధంగా ప్ర‌తిపాదిత జ‌న‌గ‌ణ‌న ప్రశ్నావళిలో 'వెనుకబడిన వర్గాలు' (OBC) అనే పదమే లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వ‌ల్ల దేశంలోని మొత్తం ఓబీసీ జ‌నాభాను క‌చ్చితంగా అంచ‌నా వేయ‌డం సాధ్యం కాద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే స్వేచ్ఛ‌గా పేర్లు రాసే అవ‌కాశం ఇవ్వ‌కుండా.. ఒక నిర్దిష్ట‌మైన కులాల జాబితాను ఉప‌యోగించాల‌ని సూచించారు. డ్రాప్-డౌన్ ఆప్షన్ ద్వారా ప్రజలు తమ కులాన్ని ఎన్నుకునేలా చేయాలని, దీనివల్ల పేర్లు, స్పెల్లింగ్‌లు, వర్గీకరణలో వ్యత్యాసాలు తగ్గుతాయని తెలిపారు.

ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రికార్డులు, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితా (SEBC), ఆంత్రోపలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సమాచారాన్ని ఉపయోగించి ఈ ప్రామాణిక జాబితాను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ, బీహార్‌లలో నిర్వహించిన కుల సర్వేల విధానాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. ఆ రాష్ట్రాల్లో నిర్దిష్ట కులాల జాబితాలనే ఉపయోగించి వివ‌రాలు సేక‌రించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ మేర‌కు 2024 తెలంగాణ కుల సర్వే, 2022 బీహార్ కుల సర్వేల జాబితా ప్రతులను ప్రధానికి పంపిన లేఖకు జత చేశారు.

Also Read..

ఇండెంట్ పెట్ట‌కుండ ఉత్త‌మ్ ఏం చేస్తున్న‌డు?

ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ఎన్నిక‌ల బ‌రిలో బండ్ల గ‌ణేష్ - అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ

ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు

Advertisement
Advertisement