Sridevi Property Case | శ్రీదేవి ఆస్తుల కేసు.. జాన్వీ కపూర్ కుటుంబానికి ఊరట..!
Sridevi Property Case | దివంగత నటి శ్రీదేవికి చెందిన భూమి వివాదంలో ఆమె కుటుంబానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని భూమికి సంబంధించి చెంగల్‌పట్టు కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
Sridevi Property Case | దివంగత నటి శ్రీదేవికి చెందిన భూమి వివాదంలో ఆమె కుటుంబానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని భూమికి సంబంధించి చెంగల్‌పట్టు కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఫలితంగా శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్, కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌కు ఉపశమనం కలిగింది. వివరాల ప్రకారం.. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని 4.77 ఎకరాల భూమిని శ్రీదేవి 1988లో ముదలియార్ కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి శ్రీదేవి కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే, చంద్రశేఖరన్ ముదలియార్ రెండో భార్య పిల్లలమని నటరాజన్, శివగామితో పాటు మరికొందరు వ్యక్తులో ఆ భూమిలో తమకు వారసత్వ వాటా వస్తుందంటూ చెంగల్‌పట్టు అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.
శ్రీదేవి కుటుంబం సైతం తొలుత చెంగల్‌పట్టు కోర్టులో సవాల్ చేసింది. అయితే, కోర్టు పూర్తి విచారణ తర్వాతే యాజమాన్య హక్కులపై నిర్ణయం తీసుకోగలమంటూ వారి అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో కపూర్ కుటుంబం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో ప్రత్యర్థులు 2005లో తాంబరం తహసీల్దార్ కార్యాలయం నుంచి తప్పుడు పత్రాలతో వారసత్వ ధ్రువీకరణపత్రం పొందారని ఆరోపించారు. ముదలియార్ మొదటి భార్య జీవించి ఉండగానే రెండో వివాహం జరిగిందని, కాబట్టి వారసత్వ వాదనలు చట్టబద్ధంగా చెల్లవన్నారు. వాదనలు విన్న జస్టిస్ టీవీ తమిళ్‌సెల్వి చెంగల్‌పట్టు కోర్టు విచారణపై మధ్యంతర స్టే విధించారు. కేసు విచారణను మార్చి 26కి వాయిదా వేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






