Madhubala Biopic | మధుబాల బయోపిక్‌లో అనీత్ పడ్డా..! అసలు విషయం ఇదే..!
Madhubala Biopic | అలనాటి హీరోయిన్ మధుబాల జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ను తెరకెక్కించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో లెండజరీ హీరోయిన్ పాత్రలో ఎవరు కనిపిస్తారన్న చర్చ సాగుతోంది. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు వినిపించింది. ఇందులో వాస్తవం లేదని తేలిందని. తాజాగా మరో యంగ్ సెన్సేషన్‌ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపించింది.
Entertainment | Published On Mar 11, 2026, 5.03 pm IST
Madhubala Biopic | అలనాటి హీరోయిన్ మధుబాల జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ను తెరకెక్కించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో లెండజరీ హీరోయిన్ పాత్రలో ఎవరు కనిపిస్తారన్న చర్చ సాగుతోంది. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు వినిపించింది. ఇందులో వాస్తవం లేదని తేలిందని. తాజాగా మరో యంగ్ సెన్సేషన్‌ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపించింది. ఆమె ఎవరో కాదు సియారా బ్యూటీ అనీత్ పడ్డా మధుబాల బయోపిక్ కోసం ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉందని, అధికారికంగా మేకర్స్ ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వార్తల్లోనూ ఎలాంటి నిజం లేదని స్పష్ట చేశాయి. బయోపిక్‌లో అనీత్ పడ్డాని తీసుకున్నారనే వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సైయారా మూవీతో కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో రానున్న శక్తి షాలిని మూవీలో లీడ్ రోల్‌లో నటించనున్నది.
ఇదిలా ఉండగా.. మధుబాల బయోపిక్‌లో అనీత్ పడ్డా సరిపోదని, త్రిప్తి డిమ్రిని ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఓ అభిమాని ఓ అడుగు ముందుకే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో మధుబాల పాత్రను పోషించే సామర్థ్యం త్రిప్తి డిమ్రీకే ఉందని పేర్కొన్నాడు. మరొక యూజర్ స్పందిస్తూ త్రిప్తి కళ్లతోనే భావోద్వేగాలను పలికిస్తుందని తెలిపాడు. సన్నివేశాల్లో మాటలు లేకపోయినా.. ఆమె కళ్లలో కనిపించే భావోద్వేగాలు ఆ పాత్రను మరింత బలంగా చూపిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బయోపిక్‌కు డార్లింగ్స్ దర్శకురాలు జస్మీత్ కే రీన్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సహకారం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. నిర్మాతలు తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మధుబాల విషయానికి వస్తే, 1950లలో భారతీయ సినీ రంగంలో ప్రముఖ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎనిమిదేళ్ల వయసులోనే బాలనటిగా సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 1947లో విడుదలైన నీల్‌కమల్ (Neel Kamal) చిత్రంతో 14 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం మొఘల్‌ఏ-ఆజమ్ (Mughal-e-Azam), మిస్టర్‌అండ్‌మిసెస్ 55 (Mr. & Mrs. 55), చల్తీ కా నామ్‌గాడీ (Chalti Ka Naam Gaadi), హౌరా బ్రిడ్జ్(Howrah Bridge) వంటి చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. ఆ సమయంలో ఆమెకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నవారు ముగ్గురు హీరోలు మాత్రమే. అందులో దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్ (Raj Kapoor), దేవ్‌ఆనంద్ (Dev Anand). ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మధుబాల 1969లో కేవలం 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు గతంలో పలువురు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు భన్సాలీ నిర్మాతగా ఈ ప్రాజెక్టు ముందుకు వస్తుందా లేదా అనేది ఎదురుచూడాల్సిందే.
Read Also :
త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ‘బలగం’ కావ్య..! వరుడు ఎవరో తెలుసా..?
నాలుగేళ్ల బంధానికి తెర..! సోహైల్‌తో విడాకులు తీసుకున్న హన్సిక మోత్వాని..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



