Anil Ravipudi | బిగ్‌బాస్ కా బాప్ – తెలుగులో మరో కొత్త రియాలిటీ షో – జడ్జ్‌గా అనిల్ రావిపూడి – లాంఛ్ ఎప్పుడంటే?
తెలుగులో మరో కొత్త రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కు అనిల్ రావిపూడి జడ్జ్‌గా కనిపించబోతున్నారు. శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరంటే?
Entertainment | Published On Mar 3, 2026, 6.54 pm IST
Anil Ravipudi | రియాలిటీ షోస్‌లో బిగ్‌బాస్‌కు వచ్చినంత క్రేజ్ ఏ షోకు రాలేదు. బిగ్‌బాస్‌కు పోటీగా చాలానే షోస్ మొదలయ్యాయి. కానీ ఏవి కూడా బిగ్‌బాస్‌ను బీట్ చేయలేకపోయాయి. హిందీలో మొదలైన బిగ్‌బాస్ ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ క్రేజ్ క్రమక్రమంగా తగ్గిపోతుంది. దాంతో జియో హాట్‌స్టార్ మరో కొత్త షో ప్లాన్ చేసింది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో ఓ సెలిబ్రిటీ కపుల్ షోను తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది. మొత్తం పది జంటలు ఓ లగ్జరీ విల్లాలో పది వారాల (70 రోజులు) పాటు కలిసి ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ షోను ఉండబోతున్నట్లు వెల్లడించింది.
అనిల్ రావిపూడి...
ఈ కపుల్ రియాలిటీ షోకు జడ్జ్‌లు కూడా కన్ఫామ్ అయ్యారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు సీనియర్ హీరోయిన్లు రాధ, లయ జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారు. శ్రీముఖి హోస్ట్‌గా కనిపించబోతుంది. జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ మాలో ఈ షో టెలికాస్ట్ కానుంది. త్వరలోనే ఈ షో లాంఛ్ కానున్నట్లు ఇటీవల జియో హాట్‌స్టార్ ప్రకటించింది. బిగ్‌బాస్ తరహాలోనే కంటెస్టెంట్స్‌కు రకరకాల టాస్కులు, గేమ్స్‌తో ఈ షో ఉండబోతున్నట్లు సమాచారం.
కంటెస్టెంట్స్ ఎవరంటే?
మ్యాడ్ ఫర్ ఈజ్ ఆదర్ షోలో పాల్గొనే కంటెస్టెంట్‌లు అల్రెడీ ఫిక్సైనట్లు సమాచారం. సీరియల్ యాక్టర్లతో పాటు కొందరు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, వెబ్‌సిరీస్, సోషల్ మీడియాతో ఫేమస్ అయిన నటులు కూడా ఈ షోలో జంటలుగా కనిపించబోతున్నట్లు సమాచారం.నూకరాజు - ఆసియా, ఇమామ్మాన్యుయేల్ - మాధురి, అమర్‌దీప్ - తేజస్విని (తేజు), ప్రియాంక జైన్ - శివకుమార్ , హరిత - హరీష్ , నటరాజ్ మాస్టర్ - నీతూ , అంజలి - పవన్ సంతోష్, శుభశ్రీ రాయగురు - అజయ్, సోనియా సింగ్ - సిద్ధు , సాండ్రా - మహేష్ బాబు , వాసంతి - పవన్ కల్యాణ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో కంటెస్టెంట్స్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరే ఉంటారా? కొత్త వాళ్లు విల్లాలో అడుగుపెడతారా అన్నది లాంఛింగ్ రోజు రివీల్ కానుంది. లాంఛింగ్ ఎపిసోడ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

Vidya Balan | ఐశ్వర్య రాజేశ్ పాత్రలో విద్యాబలన్..! ఇది మన తెలుగు సినిమానే..!
మే 13, 2026

Ashu Reddy | అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ఫొటోల వెనకున్న ట్విస్ట్ ఇదే – రియల్ కాదు…రీల్ లైఫ్‌లో…
మే 9, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



